వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్యాంగ్ రేప్ కేసులో ఆటో డ్రైవర్ సహా ముగ్గురికి జీవితఖైదు

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన హన్మకొండ రాయపుర ప్రాంతానికి కుంట్ల శివ, జోగు సురేష్, వరంగల్ రామన్నపేట ప్రాంతానికి చెందిన ఓడపల్లి నరేష్‌కు యూవజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 27 వేల చొప్పున జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కేబీ. నర్సింహులు మంగళవారం తీర్పు చెప్పారు. నేరస్తులు ముగ్గురూ డ్రైవర్లే.

పోలీసుల కథనం ప్రకారం - రాయపర్తి మండలం రాగన్నగూడెం పరిధి గణేష్‌కుంట తండాకు చెందిన బాలిక హన్మకొండ సూర్య ప్రమోషన్స్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. నిరుడు డిసెంబర్ 30న జఫర్‌గడ్ మండలం ముగ్ధుం తండాకు చెందిన స్నేహితురాలితో కలిసి నల్లగొండ జిల్లా భువనగిరిలో శిక్షణకు బయల్దేరింది. హన్మకొండ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ వరకు వెళ్లేందుకు ఆటోలో ఎక్కారు. ఇద్దరు యువకులు తర్వాత ఆటో ఎక్కారు.

Gang rape

మాయమాటలు చెప్పి రఘునాథపల్లి వైపు ఆటో తరలించి దారి మళ్లించారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆటో ఆపి మద్యం తాగారు. బాలికపై రాత్రి నుంచి తెల్లవారి జాము వరకు సామూహిక లైంగికదాడి చేశారు. భువనగిరికి తీసుకెళ్తామని ఆటోలో మళ్లీ ఎక్కించుకున్నారు. జనగామ సమీపంలో మరోసారి లైంగికదాడికి యత్నించగా బాధితురాలు నడుస్తున్న ఆటోలోంచి దూకింది. ఆటో ఆపగా మరో బాలిక కూడా దిగింది. నిందితులు ముగ్గురు పారిపోయారు. బస్టాండ్‌లో పోలీసులు ఆరా తీయగా జరిగిన ఘోరాన్ని బాధితురాలు వివరించారు.

ఆమె ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సత్యనారాయణ నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను విచారణ చేసిన కోర్టు నేరం రుజువుకావడంతోపై విధంగా తీర్పిచ్చారు. ప్రాసిక్యూషన్ పక్షాన లైజన్ ఆఫీసర్ వల్లెపురెడ్డి రఘుపతిరెడ్డి విచారణ పర్యవేక్షించగా, కానిస్టేబుల్ కె.శంకర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పీపీ జి.రామానుజరెడ్డి వాదించారు.

English summary
Three accused have been sentenced for life in a gang rape case in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X