జగన్ కు మరో సన్నిహిత నేత గుడ్ బై - పవన్ హామీతో...!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకు న్న కూటమి పార్టీల నేతలు వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. రాజ్యసభ, శాసన మండలిలో ఇప్పటికే రాజీనామాల పర్వం కొనసాగుతోంది. జగన్ హయాంలో మంత్రులుగా పని చేసిన వారు సైతం పార్టీ వీడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో విశాఖ మాజీ మంత్రి చేరారు.
వైసీపీకి రాజీనామా
కూటమి పైన మాజీ సీఎం జగన్ పోరుబాట ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా హామీ లు అమలు చేయలేదంటూ వరుస నిరసన కార్యక్రమాలకు నిర్ణయించారు. ఇంత తక్కువ కాలం లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం మరొకటి లేదని పార్టీ నేతలకు జగన్ చెబుతున్నారు. అదే సమయంలో ఖచ్చితంగా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం పెంచుతున్నారు. కానీ, పార్టీ నుంచి ముఖ్య నేతలు మాత్రం వెళ్లిపోతున్నారు. నాడు టీడీపీ నుంచి వైసీపీలో చేరి భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ వైసీపీ వీడుతున్నారు. టీడీపీ, జనసేన నేతలతో టచ్ లో ఉన్నారు.

అడుగులు ఎటు
2009లో ప్రజారాజ్యం నుంచి అవంతి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చిరంజీవి, మెగా బ్రదర్స్ కు దగ్గరయ్యారు. విశాఖ సీనియర్ నేత గంటా తో తొలి నుంచి సన్నిహితంగా ఉండేవారు. రాష్ట్ర విభజన తరువాత గంటాతో కలిసి అవంతి టీడీపీలో చేరారు. 2014 ల నాటి రాజకీయ సమీకరణాల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన అవంతి టీడీపీ నుంచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఆ తరువాత గంటాతో విభేదాలు వచ్చాయి. దీంతో, టీడీపీని వీడి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. నాడు దక్కిన హామీ మేరకు భీమిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తరువాత జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు.

జనసేనలోకి ఎంట్రీ..!
అవంతి మంత్రిగా ఉన్న సమయంలో నాడు గంటా వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేయగా అడ్డుకు న్నారు. 2024 ఎన్నికల్లో గంటా చేతిలో భీమిలిలో అవంతి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు. పవన్ పైన అవంతి గతంలో చేసిన విమర్శలు, పవన్ సైతం అవంతి పైన చేసిన కామెంట్స్ తో జనసేనలో అవకాశం పైన చర్చ జరుగుతోంది. అదే విధంగా తిరిగి టీడీపీలోకి రావటం పైన స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అవంతి జనసేన వైపే మొగ్గు చూపుతున్నా ని సమాచారం. ఇప్పటికే పవన్ తో అవంతి సన్నిహిత నేతలు రాయబారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అవంతి జనసేనలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications