పాఠంగా యోగా: చంద్రబాబుతో రామ్‌దేవ్ భేటీ
హైదరాబాద్: యోగా గురు రామ్‌దేవ్ బాబా మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ను కూడా ఆయన కలిశారు. సీమాంధ్ర నూతన ద్రష్టగా రామ్‌దేవ్ బాబా చంద్రబాబును అభివర్ణించారు.
చంద్రబాబుతో కలిసిన విషయాన్ని ట్విట్టర్లో రాశారు. చంద్రబాబును తన తొలి అన్నయ్యగా ఆయన చెప్పుకున్నారు. నాయకుడిగా కన్నా చంద్రబాబును తాను అన్నయ్యగానే చూస్తానని రామ్‌దేవ్ అన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను తమ్ముడిగా చూస్తానని ఆయన చెప్పారు.

యోగాను, ఆధ్యాత్మిక జ్ఝానాన్ని విద్యా సంస్థల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని తాను చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు ట్వీట్ చేశారు. తిరుపతి బాలాజీ దేవస్థానం సమీపంలో యోగా, ఆయుర్వేదం, నేచురోపతిలకు చెందిన భారీ పతంజలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఆయన తెలిపారు.
రామ్‌దేవ్ బాబా మొదటి నుంచీ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బిజెపికి కూడా ఆయన అనుకూలంగా వ్యవహరించారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications