జగన్‌కు బాజిరెడ్డి షాక్, తెరాసలోకి: మల్కాజిగిరికే: జెపి

Bajireddy to join TRS
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జంపింగ్స్ కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకివ్వనున్నారు. ఆయన త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు.

ఆయనను తెరాస నిజామాబాద్ రూరల్ నుండి రానున్న ఎన్నికల్లో పోటీ చేయించనుందని సమాచారం. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాదాపు ఖాళీ అయింది. ప్రస్తుతం ఉన్న ముఖ్యనేతల్లో బాజిరెడ్డి ఒకరు. ఆయన కూడా ఇప్పుడు జగన్‌కు షాకిస్తున్నరు.

కాంగ్రెసుతోనే పోటీ: హరీష్

తమకు కాంగ్రెసు పార్టీతోనే పోటీ అని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వేరుగా చెప్పారు. సిపిఎంతో పొత్తు ప్రసక్తే లేదన్నారు. సిపిఐతో చర్చలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో తమకు కాంగ్రెసు పార్టీతోనే పోటీ అని, ఉత్తర తెలంగాణలోను తమ హవానే ఉంటుందన్నారు.

బంగారు తెలంగాణ కోసం అందరు రావాలి: పొన్నాల

బంగారు తెలంగాణ కోసం అందరు కలిసి రావాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కోరారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ బలంగా ఉందన్నారు. ఒంటరిగా పోటీకి తాము సిద్ధమన్నారు. అమలు చేయలేని హామీలతో కెసిఆర్ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని కానీ, ప్రజల్ని ఎవరు మభ్యపెట్టలేరన్నారు.

మల్కాజిగిరి నుండి సిద్ధం: జెపి

లోకసభకు పోటీ చేయాల్సి వస్తే తాను మల్కాజిగిరి నుండి పోటీ చేస్తానని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ గురువారం చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని సూచనలొస్తున్నాయని, అందుకే లోకసభకు పోటీ చేయనున్నట్లు చెప్పారు. సాధారణ ఎన్నికల్లో లోకసత్తా పరిమిత స్థాయిలోనే పోటీ చేస్తుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+