హైదరాబాద్ ప్రచారంపై నిర్ణయం తీసుకుంటా: బాలకృష్ణ, కాపుల ఆందోళన

రాజమండ్రి/ హైదరాబాద్: తన అల్లుడు నారా లోకేష్‌ బర్త్‌డే సందర్భంగా బాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో శనివారంనాడు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీలో ప్రచారంపై హైదరాబాద్‌ వెళ్లాక నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు.
100వ చిత్రానికి ప్రత్యేక ప్లాన్‌ అంటూ ఏమీ లేదని ఆయన అన్నారు. ఏదేమైనా మంచి కథతో 100వ చిత్రం చేస్తానని నందమూరి బాలకృష్ణ అన్నారు. కాగా, బాలకృష్ణ ఎదుట కాపులు ఆందోళనకు దిగారు. కాపులను బీసీల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.

Balakrishna faces Kapus protest

ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. దాంతో కాపులు ఆందోళనలను విరమించుకున్నారు. డిక్టేటర్ సినిమాపై కూడా బాలకృష్ణ మాట్లాడారు.

ఇదిలావుంటే, టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు తెలుగుదేశం నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు చెందిన కార్యకర్తలు కూడా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌‌కు తరలివచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+