పిఎ వ్యవహారం: బాలకృష్ణకు షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు
బాలకృష్ణ పిఎ వ్యవహారం ముదురుతోంది. తెలుగుదేశం హిందూపురం నాయకులు బాలకృష్ణకు షాక్ ఇచ్చారు. ఇద్దరు జెడ్పీటీసిలు రాజీనామాలు చేశారు.
అనంతపురం: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అసమ్మతి పోరు తీవ్ర రూపం దాల్చింది. బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పిఎ) శేఖర్ వ్యవహారంపై కొంత మంది తెలుగుదేశం నాయకులు నిరసన గళం విప్పుతున్నారు.
శేఖర్ ఆగడాలు శ్రుతి మించుతున్నాయని ఆరోపిస్తూ హిందూపురం నియోజకవర్గం పరిధిలోని చిలమత్తూరు, లేపాక్షి జెడ్పిటీసిలు రాజీినామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను వారు జెడ్పీ చైర్మన్‌కు, సిఈవోకు పంపించారు. అంతే కాకుండా ఆదివారం హిందూపురంలో టిడిపి అసంతృప్త నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే, సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

బాలకృష్ణకు వ్యక్తిగగత సహాయకుడిగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ శేఖర్ ప్రజల నుంచి, టిడిపి నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి లంచాలు తీసుకుంటున్నాడని హిందూపురం టిడిపి నాయకులు కొంత మంది ఆరోపిస్తున్నారు. శసేఖర్ మితిమీరిన జోక్యానికి చెక్ పెట్టడానికి అన్నట్లు మాజీ ఎమ్మెల్యే సిసి వెంకటరాముడు, అంబికా లక్ష్మినారాయణ, జెడ్పీటిసి సభ్యులు హిందూపురం రూరల్ ప్రాంతంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
'పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది, ఇది టీడీపీ కుటుంబం, ఎవరూ నా అనుమతి లేకుండా, నా ఇష్టానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించరాదు' అని బాలయ్య చెప్పినట్టుగా రంగనాయకులు తెలిపిన విషయం తెలిసిందే. ఆయన అలా చెప్పిన తర్వాత కూడా ఆసమ్మతి జ్వాలలు ఆరడం లేదు.












Click it and Unblock the Notifications