హిందూపురం నుండి బాలయ్య, తాడిపత్రి జెసి దివాకర్‌కే!

పార్టీ అధినాయకత్వం అంతర్గతంగా వేగంగా కసరత్తు పూర్తి చేస్తోంది. సీమాంధ్రలోని 175 స్థానాల్లో సుమారు 126 స్థానాల అభ్యర్థులపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చింది. అయితే హిందూపురంలో పోటీపై బాలకృష్ణ అభిప్రాయం తేలాల్సి ఉంది. ఇక, అనధికారికంగా ఖరారు చేసిన అభ్యర్థిత్వాలను ఐవిఆర్ఎస్ విధానం ద్వారా జరిపే ప్రజాభిప్రాయ సేకరణతో సరిపోల్చుకోవాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.
స్థానికంగా ఉన్న రాజకీయ వాతావరణంలో ఐవిఆర్ఎస్‌లో కూడా ఇవే పేర్లపై సానుకూలత వ్యక్తం కావచ్చని పార్టీ భావిస్తోంది. పార్టీ అధికారిక జాబితాలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశముంది. ఇంకా ఖరారు కాని సీట్లపై కసరత్తు కొనసాగుతోంది. వీటిలో కొన్ని సీట్లలో సిటింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నా అక్కడ ఇతరుల నుంచి కూడా గట్టి పోటీ ఉండడంతో మరోమారు పరిశీలన జరుపుతున్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చే వారి విషయం కూడా చూసుకుని తుది నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో కొన్ని సీట్లలో అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టారు. ఎంపీ అభ్యర్థులు సామాజిక సమీకరణాలను బట్టి ఇందులో కొందరి పేర్లు ఆఖరి నిమిషంలో మార్పులు, చేర్పులకు గురయ్యే అవకాశముంది.












Click it and Unblock the Notifications