అందుకే బాలకృష్ణ పారిపోయారు, బ్రహ్మానంద రెడ్డి ఎక్కడో: రోజా
రెండు రోజుల క్రితం నంద్యాలలో ప్రచారం నిర్వహించిన హిందూపురం శాసన సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు.
నంద్యాల: రెండు రోజుల క్రితం నంద్యాలలో ప్రచారం నిర్వహించిన హిందూపురం శాసన సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు.
చదవండి: జన'సేన' కోసం రంగంలోకి వైసిపి: పవన్ కళ్యాణ్ ఎమోషన్ మిస్సయిందా?

బాబుకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో నిర్వహించిన రోడ్డు షోలో ఆమె మాట్లాడారు. బ్రిటిష్ వాళ్ల కన్నా మనల్ని ఘోరంగా మోసం చేసిన చంద్రబాబుకు ఓటర్లు కొట్టే దెబ్బతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలన్నారు.

ఫ్యాన్ లోపల, సైకిల్ బయట
ఫ్యాన్ లోపల ఉంటుందని, సైకిల్ బయట ఉంటుందని రోజా అన్నారు. మనకు ఎప్పుడు పని వచ్చినా శిల్పా మోహన్ రెడ్డి పక్కనే ఉంటారని చెప్పారు. భూమా బ్రహ్మానంద రెడ్డి ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. కాబట్టి, ఎంత తిరిగినా ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేస్తేనే చల్లగా ఉంటుందన్నారు.

టిడిపికి అబ్బా అనిపించేలా
2019లో మనం అధికారంలోకి రాబోతున్నామని, రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోబోతున్నామని రోజా అన్నారు. దానికి నాందిగా ఈ రోజు జరిగే ఈ ఉపఎన్నికల్లో నంద్యాల ప్రజలు టిడిపికి 'అబ్బా' అనిపించేలాగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్నారు.

బాలకృష్ణ అందుకే పారిపోయాడు
మహిష్మతి సామ్రాజ్యం ఎప్పుడూ బాహుబలిదేనని, అలాగే, నంద్యాల గడ్డ ఎప్పుడూ వైయస్ కుటుంబానికే అని నిరూపించాలని రోజా అన్నారు. ఫ్యాన్ గట్టిగా వీస్తోందని, విగ్ ఎగిరిపోతుందని బాలకృష్ణ పారిపోయాడని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications