నందమూరి తారకరత్న ఆరోగ్యం పై బాలకృష్ణ క్లారిటీ - ఎమోషనల్..!!
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ వివరించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించాలని నిర్ణయించారు.
ఆకస్మికంగా కుప్ప కూలిన నందమూరి తారకరత్న ఆరోగ్యం పైన బాలకృష్ణ వివరించి చెప్పారు. తారక రత్న మ్యాసివ్ గుండెపోటుకు గురైనట్లు బాలకృష్ణ వెల్లడించారు. కుప్పంలో లోకేష్ పాదయాత్ర కు మద్దతు గా వచ్చిన తారకరన్న ఆకస్మికంగా కుప్ప కూలారు. వెంటనే పార్టీ నేతలు దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ తారకరత్న గుండెపోటు కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో..మరో ప్రయివేటు ఆస్పత్రికి మార్చారు. అక్కడకు వెళ్లే సరికి శరీరం బ్లూ రంగులోకి మారినట్లు గుర్తించారు. యాంజియోగ్రామ్ చేసారు.
గుండెలో ఎడమ వైపు వాల్వ్ బ్లాక్ అయినట్లు గుర్తించారు. యాంజియో చేసి స్టంట్ లు వేసారు. వెంటనే బాలయ్య ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో చర్చించారు. అదే సమయంలో చంద్రబాబు - జూనియర్ ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఉన్న బాలయ్యకు ఫోన్ చేసారు. తారక రత్న ఆరోగ్యం గురించి వాకబు చేసారు. ఇక, తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు. తారకరత్న మ్యాసివ్ గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు. మిగిలిన పారా మీటర్స్ మెయిన్ టెయిన్ చేయటం లో వైద్యులు శక్తి మేర పని చేస్తున్నారని వివరించారు. తొలతు ఏయిర్ లిఫ్ట్ ద్వారా బెంగళూరు తరలించాలని ఆలోచన చేసినా.. సాంకేతికంగా వచ్చే ఇబ్బందులతో అంబులెన్స్ లోనే బెంగళూరుకు తరలించాలని నిర్ణయించామని బాలయ్య చెప్పారు.

చంద్రబాబు ప్రతీ పది నిమిషాలకు ఒక సారి ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య గురించి వాకబు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నానమ్మ - తాత ఆశీర్వాదం.. తారకరత్న సతీమణి మాంగల్య బలంతో ఖచ్చితంగా తిరిగి కోలుకుంటారని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేసారు. అభిమానుల ప్రేమ తిరిగి బలాన్ని ఇస్తుందని బాలయ్య చెప్పుకొచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..తారకరత్న కోలుకుంటారని బాలయ్య దైర్యం చెప్పే ప్రయత్నం చేసారు. పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైద్యులతో చర్చించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. చికిత్స కొనసాగుతుందని.. కోలుకుంటారనే నమ్మంతో ఉన్నామని చెప్పారు. పార్టీ ముఖ్య నేతలు..అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications