మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ పై బాలినేని కీలక వ్యాఖ్యలు..!!
మాగుంట కుటుంబం పైన రాజకీయ కుట్ర జరిగిందని బాలినేని కీలక వ్యాఖ్యలు చేసారు.
ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి జిల్లా ప్రజలతో పాటుగా పార్టీ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి బాలినేని భరోసా ఇచ్చారు. ఎంపీ మాగుంటతో బాలినేని సమావేశమయ్యారు. తన కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్ పైన మాగుంట స్పందించారు. తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారం చేస్తోందని వివరించారు. తమ కుటుంబం ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేసింది. సౌత్ ఇండియన్ గ్రూపు నుంచి ఆప్ కు విరాళాలు ఇచ్చిన వారిలో రాఘువరెడ్డి పాత్ర ఉందని పేర్కింది. అయితే, ఈ వ్యవహారంలో అసలు తమ ప్రమేయం లేదని ఎంపీ మాగుంట చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత..మాజీ మంత్రి బాలినేని ఒంగోలులో మాగుంటను కలిసారు. మాగుంట కుటుంబం ప్రజా సేవలో ముందుందని..అటువంటి వారి పైన రాజకీయ కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎవరితోనూ మాగుంటకు వివాదాలు లేవన్నారు. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయనదని చెప్పుకొచ్చారు. రాజకీయంగా మాగుంట కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఆయన కుమారుడిని అరెస్ట్ చేయటం సరి కాదని బాలినేని పేర్కొన్నారు.

మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలతో పాటుగా పార్టీ అండగా ఉంటుందని బాలినేని భరోసా ఇచ్చారు. మొత్తం చోటు చేసుకున్న పరిణామాల పైన బాలినేని ఈ సమావేశంలో మాగుంటతో చర్చించారు. ఈడీ ఆరోపణలు వారి మధ్య చర్చకు వచ్చాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో రాఘవరెడ్డికి సంబంధం లేదని మాగుంట చెప్పుకొచ్చారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసారు. తాజాగా ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలో మాగుంట రాఘవరెడ్డిని సుదీర్ఘంగా విచారించిన ఈడీ అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఈ కేసులో గతంలోనే విచారణ ..సోదాల సమయంలో ఎంపీ మాగుంట ఇదంతా సౌత్ వ్యాపారుల పైన జరగుతున్న కుట్రగా పేర్కొన్నారు. తమ మీద ఉద్దేశ పూర్వకంగానే దుష్ఫ్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు మాజీ మంత్రి బాలినిని సమావేశం తరువాత ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications