వర్షం: పంటపొలాలను పరిశీలించిన దత్తాత్రేయ(పిక్చర్స్)
కరీంనగర్: జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటపొలాలను బుధవారం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వడగళ్లవాన వల్ల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లందన్నారు.
కరీంనగర్ జిల్లాలో రైతులు పెద్ద సంఖ్యలో ఉద్యాన పంటలు వేశారన్నారు. జిల్లాలో 20 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పారు. చేతికి వచ్చిన పంటలు నష్టపోవడం వల్ల రైతుల్లో ఆవేదన నెలకొందని చెప్పారు. 55 ఇళ్లు పాక్షికంగా, 3 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు.
వరి, పసుపు, మామిడి, బొప్పాయి, అరటి తోటలు దెబ్బతిన్నాయని చెప్పారు. గతంలో 50 శాతం పంట నష్టం జరిగితే తప్ప పరిహారం వచ్చేది కాదని... ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 30 శాతం పంట నష్టం జరిగినా పరిహారం అందుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రితోపాటు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, పలువురు బిజెపి నేతలు పాల్గొన్నారు.

పంట పొలాల పరిశీలన
కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటపొలాలను బుధవారం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పరిశీలించారు.

పంట పొలాల పరిశీలన
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వడగళ్లవాన వల్ల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లందన్నారు.

పంట పొలాల పరిశీలన
కరీంనగర్ జిల్లాలో రైతులు పెద్ద సంఖ్యలో ఉద్యాన పంటలు వేశారన్నారు. జిల్లాలో 20 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పారు.

పంట పొలాల పరిశీలన
చేతికి వచ్చిన పంటలు నష్టపోవడం వల్ల రైతుల్లో ఆవేదన నెలకొందని చెప్పారు. వరి, పసుపు, మామిడి, బొప్పాయి, అరటి తోటలు దెబ్బతిన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications