చంద్రబాబును ఆహ్వానించేందుకే బెజవాడ వచ్చా: దత్తాత్రేయ
ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు.
విజయవాడ: ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని మాజీ కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ నేత బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని బండారు దత్తాత్రేయ శుక్రవారం దర్శించుకున్నారు. శరన్నరావరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.

ఆలయ పరిసరాుల చూస్తుంటే స్వచ్ఛసేవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా బాగా నిర్వహిస్తున్నారని అనిపిస్తోందని దత్తాత్రేయ కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications