జగన్ పిల్లవాడు, బెంగళూరులో హీరోయిన్స్‌తో విలాసాల్లో: టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్, పవన్ కమిటీతో భయం

Posted By:
Subscribe to Oneindia Telugu
  బెంగళూరులో హీరోయిన్స్‌తో విలాసాల్లో జగన్

  అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో జగన్‌కు భయం పట్టుకుందన్నారు.

  చదవండి: అద్భుతం, ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే లేదు, బాబును లైట్‌గా తీసుకున్నా: ముఖేష్ అంబానీ ప్రశంసలు

  చదవండి: జగన్‌కు రివర్స్, ఇరుకునపడ్డ వైసీపీ: 'డబుల్' షాక్, వీటికి సమాధానం ఏది?

  ఆయన బుధవారం మీడయాతో మాట్లాడారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న సమయంలో జగన్ పిల్లవాడని వ్యాఖ్యానించారు. బెంగళూరులోనో లేక మరెక్కడో హీరోయిన్స్‌తో విలాసాల్లో ఉండేవాడని విమర్శించారని తెలుస్తోంది.

  చదవండి: రాజీనామాపై జగన్ పక్కా ప్లాన్: సెక్షన్ 151(ఏ) ఏం చెబుతోంది? విజయసాయికి మాత్రం ఉపఎన్నిక షాక్

  విలాసాల్లో జగన్ ఉన్న సమయంలో

  విలాసాల్లో జగన్ ఉన్న సమయంలో

  జగన్ ఎవరితోనో విలాసాల్లో ఉన్న సమయంలోనే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారని బండారు అన్నారు. ప్రజలు తనను మరిచిపోతారనే భయంతో తన పార్టీ ఎంపీలతో ఆయన రాజీనామా డ్రామాకు తెరలేపారన్నారు.

  2019 పరిస్థితులను బట్టి పొత్తు

  2019 పరిస్థితులను బట్టి పొత్తు

  మార్చి 5వ తేదీలోపు ఏపీకి భారతీయ జనతా పార్టీ న్యాయం చేస్తుందని తాము భావిస్తున్నామని బండారు అన్నారు. టీడీపీ మద్దతు ఉన్నన్నిసార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని ఆయన చెప్పారు. 2019లో అప్పటి పరిస్థితులను బట్టి పొత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

  పవన్ కళ్యాణ్ కమిటీతో భయం, జగన్ మంత్రి కూడా కాలేరు

  పవన్ కళ్యాణ్ కమిటీతో భయం, జగన్ మంత్రి కూడా కాలేరు

  పార్లమెంటు సెషన్స్‌లోనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయగలరా అని బండారు సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో జగన్‌కు భయం పట్టుకుందన్నారు. వాస్తవానికి జగన్ మంత్రి కూడా కాలేరని ఎద్దేవా చేశారు.

  ఏపీకి కావాల్సింది హోదానా, నిధులా

  ఏపీకి కావాల్సింది హోదానా, నిధులా

  వైసీపీ రాజీనామా పేరుతో డ్రామాకు తెరలేపిందని మంత్రి నారాయణ అన్నారు. సమస్యల పరిష్కారంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. విభజన సమస్యల పరిష్కరంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ఏపీకి కావాల్సింది హోదానా లేక నిధులా అని ప్రశ్నించారు. ఏపీ అన్ని రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు కేంద్రం ఆదుకోవాలన్నారు. హోదా పేరుతో వైసీపీ నాటకాలు ఆడితే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. ముఖేష్ అంబానీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam Party MLA Bandaru Satyanarayana Murthy make hot comments on YSR Congress Party chief YS Jaganmohan Reddy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి