అద్భుతం, ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే లేదు, బాబును లైట్‌గా తీసుకున్నా: ముఖేష్ అంబానీ ప్రశంసలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Mukesh Ambani Plans To Build Electronic Park In Tirupati

  అమరావతి: మీ వద్ద ఉన్న టెక్నాలజీ మా వద్ద కూడా లేదని, విదేశాల్లోను లేదని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

  చదవండి: జేసీకి బొత్స దిమ్మతిరిగే కౌంటర్, మేం సిద్ధం కానీ పవన్ కళ్యాణే తేల్చుకోవాలి

  చదవండి: జగన్‌తో బీజేపీ చర్చలు జరుపుతోందా?: మోడీపై బాబు 'స్నేహ' అస్త్రం, పొత్తును తేల్చేది అవే

  ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని (ఆర్టీజీ) అద్భుతంగా తీర్చిదిద్దారని చంద్రబాబుకు కితాబిచ్చారు. ఈ కేంద్రాన్ని పరిశీలించిన ముఖేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్టీజీతో ప్రజలకు అందిస్తున్న సేవలను చంద్రబాబు ఆయనకు వివరించారు.

  చదవండి: జగన్! ఆ క్షణమే రాజీనామా చేస్తాం, బాబు అలిగితే: శివప్రసాద్, ఇక బాబు కీలక నిర్ణయం!

  ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే ఎక్కడా లేదు

  ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే ఎక్కడా లేదు

  ఆర్టీజీని అన్ని రాష్ట్రాలకు చూపించాలని ముఖేష్ అంబాని.. చంద్రబాబుకు సూచించారు. ఈ టెక్నాలజీ మా వద్ద కూడా లేదన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి ఆర్టీజీ లేదన్నారు. ఏపీతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం డాటా అనేది ఎంతో కీలకమైన అంశమన్నారు.

  చంద్రబాబును అప్పుడు లైట్‌గా తీసుకున్నా

  చంద్రబాబును అప్పుడు లైట్‌గా తీసుకున్నా

  మా కంటే మీరే ఎంతో ముందు ఉన్నారని ముఖేష్ అంబానీ అన్నారు. మీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని, మూడేళ్ల క్రితం చంద్రబాబును కలిశానని, పాలనపై అప్పుడు ఆయన ఓ విజన్ చెప్పారని, అప్పుడు నేను చూద్దాంలే అనుకున్నానని, కానీ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చూశాక సంతోషంగా ఉందన్నారు.

  చాలా అరుదైన విషయం

  చాలా అరుదైన విషయం

  కలలు అందరూ కంటారని, కొందరు మాత్రమే సాకారం చేసేవారు ఉంటారని, అందులో చంద్రబాబు ఒకరు అని ముఖేష్ అంబానీ అన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్, టీవీ, ఫోన్ ఒకే వైర్ ద్వారా ఇవ్వడం చాలా అరుదైన విషయమన్నారు. కాగా, రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా గ్రామాల నుంచి సచివాలయం వరకు ఏ విధంగా కనెక్టయి ఉంటుంది అనే విషయాలను చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకొని చెప్పారు.

  బాబు టెక్నాలజీ, ముగ్ధుడైన ముఖేష్ అంబానీ

  బాబు టెక్నాలజీ, ముగ్ధుడైన ముఖేష్ అంబానీ

  గ్రామాల్లో ఏవైనా అంశాలు జరిగినప్పుడు వాటి సమాచారాన్ని ఆటోమేటిక్‌గా సచివాలయంలో ఉన్న డ్రాప్ బాక్సులో కనిపించే విధంగా పూర్తిస్థాయిలో ఆన్ లైన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని చంద్రబాబు వివరించారు. దీనిని చూసి ముఖేష్ ముగ్ధుడయ్యారు. చంద్రబాబుతో ముఖేష్ దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు ఇంటిలో విందు కోసం వెళ్లారు.

  గతంలో చంద్రబాబు మా తండ్రిని కలిసినప్పుడు

  గతంలో చంద్రబాబు మా తండ్రిని కలిసినప్పుడు

  ముఖేష్ అంబానీ ఇంకా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు.. మా తండ్రిని కలిసినప్పుడు టెలికాం రంగం వైపు అడుగు వేయాలని కోరారని చెప్పారు. సెల్ ఫోన్ ఉత్పత్తులను భారీగా పెంచామన్నారు. సెల్ ఫోన్ ధరను రూ.1500కు తేగలిగిన ఘనత మాదే అన్నారు. కాల్ లిస్టును 42 పైసలకు తగ్గించామని చెప్పారు. తిరుపతిలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ముఖేష్ తెలిపారు. 10 మిలియన్ల జియో ఫోన్ల తయారీ, టీవీల తయారీ, చిప్ డిజైన్, బ్యాటరీ తయారీ, సెట్ టాప్ బాక్సు తయారీ కంపెనీలను ఏర్పాటు చేస్తామన్నారు.

  తిరుపతిలో రోజుకు 10 లక్షల ఫోన్ల తయారీ కంపెనీ

  తిరుపతిలో రోజుకు 10 లక్షల ఫోన్ల తయారీ కంపెనీ

  ఇదిలా ఉండగా, శివరాత్రి రోజున చంద్రబాబుతో ముఖేష్ అంబానీ భేటీ రాష్ట్రానికి శుభపరిణామం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు అన్నారు. అంబానీ, చంద్రబాబు భేటీ వివరాలను తెలిపారు. ఏపీకి రావడం ఎంతో సంతోషంగా ఉందని అంబానీ అన్నారని, చంద్రబాబుతో కలిసి రియల్ టైం గవర్నెన్స్‌ సందర్శించారని, ఇది అద్భుతంగా ఉందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ రియల్ టైం గవర్నెన్స్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారని చెప్పారు. ఏపీలో ఒక్క రోజులో పది లక్షల ఫోన్లు తయారు చేసే కంపెనీ తిరుపతిలో ఏర్పాటుకు అంబానీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అనుమతులు వస్తే రెండు వారాల్లోనే శంకుస్థాపనకు సిద్ధమని చెప్పారన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు గురించి ఎలాంటి చర్చ జరపలేదని, టెక్నాలజీ రంగంలో ఏపీ బాగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారని, మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు ఇదో గొప్ప అవకాశం అని అభిప్రాయపడ్డారని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Reliance Industries chairman Mukesh Ambani has praised AP CM Chandrababu Naidu for his vision.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి