Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.

ఈ పరిణామాలను ఐక్యరాజ్యసమితి భద్రతమండలి తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఇరాన్.. తన పొరుగు దేశాలపై దాడులు చేయడాన్ని తప్పుపట్టింది. వీటిని ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి భారత్‌తో సహా దాదాపు 135 దేశాలు మద్దతు ఇచ్చాయి. దీనిపై సంతకం చేశాయి. చైనా, రష్యా మాత్రం ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో గల్ప్ పై ఇరాన్ దాడులను భారత్ తప్పు పట్టగా.. చైనా, రష్యా పరోక్షంగా సమర్థించినట్టయింది.

UN Security Council Condemns Iran Attacks on Regional Neighbours as India join hands 135 nations

మిడిల్ ఈస్ట్ లో హింస తీవ్రతరమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతమండలి దీనిపై దృష్టి సారించింది. నంబర్ 2817/ 2026 తీర్మానాన్ని ఆమోదించింది. 15 మంది సభ్యుల మండలిలో 13 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, చైనా, రష్యన్ ఫెడరేషన్ గైర్హాజర్ అయ్యాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను అత్యంత తీవ్రమైనవిగా భద్రతమండలి పరిగణించింది. వీటిని ఖండించింది.

ముఖ్యంగా నివాస ప్రాంతాలు, పౌర ఆస్తులపై దాడులను తక్షణమే నిలిపివేయాలని ఇరాన్ కు ప్రత్యేకంగా సూచించింది. బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలు, సముద్ర వాణిజ్య ఆటంక కార్యకలాపాలను ఆపాలని, ప్రాక్సీ గ్రూపులకు మద్దతు నిలిపివేయాలని కూడా తీర్మానం సూచించింది. భారత్‌తో సహా దాదాపు 135 సభ్య దేశాలు ఈ తీర్మానానికి కో-స్పాన్సర్ చేయడం ఓ రికార్డు.

ఈ తీర్మానాన్ని బహ్రెయిన్ స్వాగతించింది. ఇరాన్ అన్యాయమైన, శత్రుత్వపూరిత చర్యలను అంతర్జాతీయ సమాజం తిరస్కరిస్తోందని వ్యాఖ్యానించింది. అటు డెన్మార్క్ కూడా సానుకూలంగా స్పందించింది. ఇటువంటి సమయంలో ప్రాంతీయ గొంతులను వినడం అత్యవసరమని తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్తతకు ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదని ఫ్రాన్స్ ప్రతినిధి హెచ్చరించారు. ఇరాన్ ఈ దాడులను నిలిపివేయాలని అన్నారు.

ఓటింగ్‌కు దూరంగా ఉన్న చైనా ఈ తీర్మానాన్ని తప్పుపట్టింది. సంఘర్షణ మూల కారణాన్ని ఈ తీర్మానం ప్రతిబింబించట్లేదని వ్యాఖ్యానించింది. రష్యా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. దీన్ని పక్షపాత, ఏకపక్ష తీర్మానంగా రష్యా ప్రతినిధి అభివర్ణించారు. మొదటి ఓటింగ్ తర్వాత, రష్యన్ ఫెడరేషన్ ప్రవేశపెట్టిన రెండవ ముసాయిదా తీర్మానాన్ని మండలి తిరస్కరించింది. నిర్దుష్ట పక్షాలను పేర్కొనకుండా ఉద్రిక్తతను తగ్గించడమే లక్ష్యంగా ఉన్న ఈ డాక్యుమెంట్ నాలుగు అనుకూల ఓట్లను పొందిందంతే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+