సమంత డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా..? ఇన్ స్టా పోస్టు వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది 'మా ఇంటి బంగారం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సమంత. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో తెలుగులో రూ.100 కోట్ల వసూల్ చేసిన తొలి లేడీ ఓరియంటేడ్ సినిమాగా మా ఇంటి బంగారం రికార్డు సాధించింది. ఇక ప్రస్తుతం సమంత ప్రెగ్నెన్సీ టైమ్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె ఈ వారంలోనే మొదటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

ఈ మేరకు తాజాగా తన భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఘనంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో సమంత ఎరుపురంగు కుర్తా సెట్ ను ధరించి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ దుస్తులు ఓగాన్ బ్రాండ్ కు చెందినవిగా తెలుస్తోంది. అయితే ఆ సూట్ ధర రూ. 48,562 గా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ దుస్తులను కాటన్ సిల్క్ తో తయారు చేశారు. అలాగే దీని అంచు బ్రోకెడ్ టిష్యూతో రూపొందించబడినట్లుగా స్పష్టం అవుతోంది.
మరోవైపు సమంత లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ గర్భిణి మహిళ ఎంతో ఇష్టంగా స్నాక్స్ తింటున్న ఫన్నీ రీల్ ను తన ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేశారు. అందులో ఈ వారం మీ ప్లాన్స్ ఏంటి..? అనే టెక్స్ట్ ఉంటుంది. దానికి సమాధానంగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ రోజైనా బిడ్డకు జన్మనివ్వచ్చు.. అని ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత ఈ వారంలోనే తల్లి కానున్నట్లు ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత గతేడాది డిసెంబర్ 1 న దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి పద్దతిలో ఈ వివాహం జరిగింది.












Click it and Unblock the Notifications
