వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!
ఇరాన్‌పై దాడుల అనంతరం అమెరికాలో స్థానిక పరిస్థితులు మలుపులు తిరుగుతున్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీ రీజియన్ లోని అనేక విమానాశ్రయాలలో అనూహ్య పరిణామలు తలెత్తాయి. యుద్ధ భయాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులు చోటు చేసుకున్న ఈ ఘటనలు అమెరికన్లను ఉలిక్కిపడేలా చేసింది. అక్కడి అడ్మినిస్ట్రేషన్ ఉరుకులు పరుగులు పెట్టించింది. ఏకంగా గ్రౌండ్ స్టాప్ ను ఎత్తివేయాల్సిన వచ్చింది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కార్యకలాపాలను అంతరాయం కలిగించిన రసాయన వాసన రావడం దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య పరిష్కారం అయితన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా కార్యదర్శి సీన్ డఫీ ఎక్స్ లో ఈ విషయాన్ని ధృవీకరించారు. గ్రౌండ్ స్టాప్ ముగిసిందని, కార్యకలాపాలు తిరిగి పునఃప్రారంభం అయ్యాయని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు ఎలాంటి ప్రమాదం లేదని ఫాకియర్ కౌంటీ, ప్రిన్స్ విలియం కౌంటీ అగ్నిమాపక సిబ్బంది ధృవీకరించారని స్పష్టం చేశారు.

డఫీ తెలిపిన వివరాల ప్రకారం- ఈ తాత్కాలిక ఆంక్షలు రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్, వాషింగ్టన్ డల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బాల్టిమోర్-వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, రిచ్‌మండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కార్యకలాపాలు క్రమంగా ప్రారంభం కావడంతో.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ప్రాంత విమానాశ్రయాలకు హెచ్చరికను గ్రౌండ్ జాప్యాలుగా తగ్గించింది.
ముందురోజు- వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని విమాన రాకపోకల రద్దీని పర్యవేక్షించే పొటోమాక్ టెర్మినల్ రాడార్ అప్రోచ్ కంట్రోల్ ఈ రసాయనిక వాసన వెలువడింది. ఈ రీజియన్ లో ఇది అత్యంత కీలకం. వార్రెంటిన్, వర్జీనియాలో ఉన్న ట్రాక్ ఆన్, బాల్టిమోర్-వాషింగ్టన్, రిచ్‌మండ్-చార్లొట్టెస్విల్లే ప్రాంతాలకు ఈ పొటోమాక్ టెర్మినల్ రాడార్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలు ఇక్కడి నుంచే అందుతాయి.
ఆ వాసన వెలువడిన వెంటనే గ్రౌండ్ స్టాప్ విధించారు. దర్యాప్తు చేపట్టారు. వేడెక్కిన సర్క్యూట్ బోర్డు నుండి వచ్చిందని గుర్తించారు. దానిని మార్చేశారని డఫీ వివరించారు. ఈ బలమైన కెమికల్ వాసనకు కారణం వేడెక్కిన సర్క్యూట్ బోర్డు అని తేలినట్లు ఆయన తెలిపారు. దానిని మార్చారని పేర్కొన్నారు. పొటోమాక్ ట్రాక్ ఆన్ లో బలమైన రసాయన వాసన కొంతమంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను ప్రభావితం చేసిందని ఎఫ్ఏఏ నిర్ధారించింది.
రోనాల్డ్ రీగన్, వాషింగ్టన్ డల్లెస్, బాల్టిమోర్-వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల వద్ద విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని ఎఫ్ఏఏ ప్రతినిధి చెప్పారు. ఆయా విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సగటున 150 నుండి 222 నిమిషాల పాటు స్తంభించిపోయాయి.
-
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications