వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్.. ఈ లిస్టులో మీ బండి ఉందా..? ఇలా చెక్ చేసుకోండి..!

హైదరాబాద్‌ నగరంలోని పోలీస్ స్టేషన్లలో పాత వాహనాలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. ఏళ్ల తరబడి ఆ వాహనాలు అలాగే ఓ మూలనపడి ఉంటున్నాయి. వీటిల్లో ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు, కార్లు ఉన్నాయి. సరైన యాజమాన్య పత్రాలు లేని కారణంగా వీటిని తీసుకెళ్లడానికి ఎవరూ రావడం లేదు. ఇక మల్కాజ్‌ గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన, యజమానులు పట్టించుకోని దాదాపు 510 వాహనాలను పోలీసులు తాజాగా అంబర్‌ పేటలోని సీఏఆర్ హెడ్‌ క్వార్టర్స్‌ కు తరలించారు. అలాగే చట్ట ప్రకారం వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇక హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ నిబంధనలను అనుగుణంగా ఈ వేలంపాట నిర్వహిస్తున్నారు. అయితే వేలం వేయడానికి ముందు యజమానులకు చివరి అవకాశం కల్పించారు. ఈ మేరకు ఏదైనా వాహనంపై హక్కులు ఉంటే వెంటనే సంబంధిత వెబ్ సైట్లను ఆశ్రయించాలని అధికారులు పేర్కొన్నారు. వాహన యజమానులు, ఫైనాన్స్ లేదా బ్యాంకు హైపోథికేషన్ హక్కులు ఉన్న వ్యక్తులు/సంస్థలు తమ వాహనాల వివరాలను ఈ మేరకు అధికారిక వెబ్‌ సైట్‌ లో సరిచూసుకోవాలని వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు.

Police notice for auction of 510 vehicles in Hyderabad Check if your Vehicle is in the list or not

దాంతోపాటు బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉన్న పోలీస్ కమిషనరేట్ లో తమ వాదనను వినిపించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇక నోటీసు వెలువడిన తేదీ నుంచి 6 నెలల్లోగా సరైన యాజమాన్య పత్రాలను సమర్పించి తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవాలని పోలీసులు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన క్లెయిమ్‌ లను పరిగణనలోకి తీసుకునేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు వాహనాల వివరాలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌ సైట్ అయిన https://malkajgiripolice.telangana.gov.in ను సందర్శించాలని సూచించారు. అలాగే ఈ అంశంపై ఏవైనా సందేహాలు ఉంటే 8712662661, 8008338535 ఫోన్ నంబర్లను సంప్రదించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+