పాకిస్థాన్ లో కుప్పకూలిన డ్యామ్.. ఉప్పొంగిన వరదలు.. చైనా కంపెనీను నమ్ముకుంటే..!

భారత్ కు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌ లోని టర్బేలా డ్యామ్ విస్తరణలో భాగంగా చేపట్టిన నిర్మాణంలో ఉన్న ఐదో విస్తరణ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు కొంత భాగం కుప్పకూలింది. చైనాకు చెందిన పవర్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా లిమిటెడ్ సంస్థ ఈ డ్యామ్ నిర్మాణ పనులను చేపడుతోంది. డ్యామ్ వద్ద కొంత భాగం కుప్పకూలడంతో సమీప ప్రాంతాల్లోకి నీరు ప్రవహించింది. దాంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. నిర్మాణాలను తక్షణమే నిలిపివేశారు. కార్మికులు సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక 2025 నుంచి టార్బెలా-5 ప్రాజెక్ట్ లో ఇది రెండో అతిపెద్ద ప్రమాదం కావడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కాఫర్ డ్యామ్ కుప్పకూలింది. ఈ ఘటనకు పాకిస్థాన్ వాటర్ అండ్ పవర్ డెవలప్ మెంట్ అథారిటీ కారణమని తేలింది. ఈ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ అందించిన 15 పేజీల నివేదికను పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ దిన పత్రిక డాన్ లో ప్రచురితమైంది. కాఫర్ డ్యామ్ లో అనధికార మార్పులు చేపట్టడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ఆ రిపోర్టులో వెల్లడైంది. అలాగే కాంట్రాక్ట్ లో భారీ లోపాలు జరిగినట్లు అందువల్లనే డ్యామ్ కుప్పకూలినట్లు స్పష్టం చేసింది.

Pakistan A dam under construction collapsed Turbela Dam Questions on the Chinese construction firm

ఇక తాజాగా జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను హరిపూర్ డిప్యూటీ కమిషనర్ వసీమ్ అహ్మద్ వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకుని తనిఖీ నిర్వహించిన ఆయన.. ఈ ప్రమాదంలో పాకిస్థాన్, విదేశీ కార్మికులకు సురక్షితంగా కాపాడామని అన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. అయితే నీటి ప్రవాహంలో ఓ పాకిస్థానీ కార్మికుడు కొట్టుకుపోగా ఎమర్జెన్సీ టీమ్స్ అతడ్ని సురక్షితంగా రక్షించాయని తెలిపారు.

ఈ ఘటనతో టార్బెలా-5 ప్రాజెక్ట్ వద్ద నిర్మాణ పనులను నిరవధికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. సమగ్ర దర్యాప్తు తర్వాత ఈ ఘటనకు గల కారణాలపై స్పష్టత వస్తుందని.. ఆ తర్వాతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక టార్బెలా-5 విస్తరణ ప్రాజెక్ట్ ను 1,530 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ అంచనా వ్యయం తొలుత 82 బిలియన్ పాకిస్థానీ రూపాయలుగా ఉండగా ఆ తర్వాత 317 బిలియన్ పాకిస్థానీ రూపాయలకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+