నానమ్మ ఇందిరా గాంధీతో రాహుల్ గాంధీ ముచ్చట్లు.. పాత వీడియో వైరల్

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ.. తన నానమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో సరదా సంభాషణకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకే ఫ్రేమ్‌ లో సోనియా గాంధీ, మేనకా గాంధీ కూడా ఉన్నారు. 1980-81 నాటి అరుదైన దృశ్యాలను ఈ వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో చూసి అప్పటి జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఈ వీడియోలో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఇందిరా గాంధీ మాట్లాడుతుండగా ఆమెతో మనవడు రాహుల్ గాంధీ ముచ్చటిస్తున్నారు.

ఇదే వీడియోలో సోనియా గాంధీ ఫోన్ లో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ ను తెలుసుకుంటూ ఉండటం కనిపించాయి. అనంతరం ఆ వివరాలను ఇందిరా గాంధీ చెప్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ.. నానమ్మకు ప్రశ్నలు వేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

RahulGandhi chitchat with his grandmother Indira Gandhi Old video goes viral on social media now

ఇక ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించిన సంగతి తెలిసిందే. కాల్పుల శబ్దం విని ఒక్కసారిగా బయటకు వచ్చి చూడగా.. తన అత్తగారు రక్తపు మడుగులో కనిపించారని తెలిపారు. ఆమెను మమ్మీ.. మమ్మీ అని పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇందిరా గాంధీ కట్టుకున్న చీర మొత్తం రక్తంతో తడిసిపోయిందని.. ఛాతీపైనా రక్తం కనిపించిందని వివరించారు. నవంబర్‌ 10న విడుదల కానున్న తన ఆత్మకథ 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌' లో ఈ విషయాలను సోనియా గాంధీ పొందుపరిచారు.

ఇక ఇందిరా గాంధీ భారత దేశ తొలి, ఏకైన ప్రధానమంత్రిగా సేవలందించారు. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భారత ప్రధానిగా దాదాపు 16 సంవత్సరాల పాటు కొనసాగారు. 1984, అక్టోబర్ 31 న తన సొంత బాడీ గార్డ్స్ జరిపిన కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+