"సంక్రాంతి తర్వాత 'ప్రజాబలం' పర్యటనతో సునామీ సృష్టిస్తా"

సంక్రాంతి తర్వాత 'ప్రజాబలం' పేరుతో తెలంగాణ నలుమూలల తిరుగుతానని ఆ ప్రజాబలంతో సునామీ సృష్టిస్తే మోదీ, కేడీలు కొట్టుకుపోవడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అటు కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్‌ కు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టిందని.. బుద్ధి ఇవ్వడానికి ఎన్నేళ్లు పడుతుందోనని ఎద్దేవా చేశారు. పది జన్మలు ఎత్తినా.. కేటీఆర్ ఎన్నటికీ రేవంత్‌ రెడ్డి కాలేరని అన్నారు. రేవంత్‌ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం, నమ్మినవారికి ప్రాణమిచ్చే త్యాగం ఉండాలన్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో మూడు రోజుల పర్యటన ముగిసిన నేపథ్యంలో లగచర్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎల్‌ నినో వల్ల నీటి కరువు ఏర్పడింది. నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. ఆరుతడి పంటలు వేయండి. సభలతో, ప్రజాబలంతో.. ఎల్‌నినో కరువుని ఎదుర్కుందాం. సంక్రాంతి తర్వాత తెలంగాణ నలుమూలల తిరుగుతా.. ప్రజాబలంతో సునామీ సృష్టిస్తా.. అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే కొడంగల్‌ కు నీళ్లు, నిధులు తెచ్చుకునే ముందు ఎవరైనా అడ్డం పడితే.. పండబెట్టి తొక్కుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలేపల్లి ఎల్లమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా.. 2028 నాటికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, కొడంగల్ భూములు తడిమి, పచ్చని పంటలు పండిస్తానని స్పష్టం చేశారు. అలాగే తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.

CMRevanth made strong comments on KTR CMRevanth Reddy made strong comments on KTR lagacherlameeting

మరోవైపు కేసీఆర్ పాలనలో రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్‌ హౌస్‌ లో పడుకున్నారని.. తమకు అప్పులు చేసే అలవాటు కానీ, అబద్ధాలు చెప్పే అలవాటు కానీ లేవని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ 34 నెలల్లోనే రూ. 2 లక్షల కోట్లకు పైగా వడ్డీలు కట్టామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+