తెలంగాణలో జనగణన షెడ్యూల్ ఫిక్స్.. నోటిఫికేషన్‌ జారీ.. తేదీలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో జనగణనకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ లోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన చేయనున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ ఉంటుంది.

జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌ కు అవకాశం కల్పించనున్నారు. ఇక గతంలో మొదటి దశలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను పూర్తి చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు రెండో దశ జనాభా లెక్కల సేకరణను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్‌ ను పునరుద్ఘాటిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నవంబర్ 9న జీవో ఎంఎస్ నెం. 155 ను విడుదల చేసింది.

Telangana census schedule finalized These are the dates Key bio issued Telangana census latest

ఆ వివరాలు చూస్తే.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనగా ప్రజలు స్వయంగా తమ వ్యక్తిగత వివరాలను యాప్ ద్వారా లేదా వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకునేందుకు 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు అవకాశం కల్పించారు. జనగణన ప్రక్రియలో భాగంగా 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. ఇక జనాభా లెక్కల సవరణ ప్రక్రియ 2027 మార్చి 1 నుంచి ఐదవ తారీఖు వరకు జరుగుతుంది. ఇక ఈ జనాభా లెక్కలకు రిఫరెన్స్ డేట్ గా 2027 మార్చి 1 రాత్రి 12 గంటలకు నిర్ణయించారు. ఈ మేరకు వో ఎంఎస్ నెం.155 జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+