అమెరికా అధ్యక్ష భవనంలో తాత్కాలిక లాక్ డౌన్.. కారు ప్రమాదంతో ఉలిక్కిపడ్డ ట్రంప్..!

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో తాత్కాలిక లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకొచ్చారు. శ్వేతసౌథం సమీపంలోని లఫాయెత్ స్క్వేర్ వద్ద తాజాగా ఓ కారు బీభత్సం సృష్టించింది. సైన్ బోర్డ్ ను ఢీ కొని హల్ చల్ చేసింది. కారులోని దుండగుడ్ని సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లు అలాగే నేషనల్ గార్డ్ ట్రూప్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఈ మేరకు భద్రతా కారణాల దృష్ట్యా వైట్ హౌజ్ ప్రాంతంలో తాత్కాలిక లాక్ డౌన్ ను విధిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కారు ప్రమాదం జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్ లోనే ఉన్నారు. ఇక 2023లోనూ అమెరికా అధ్యక్ష భవనం వద్ద ఇలాంటి ఘటన జరిగిన విషయం తెలిసిందే.

మరోవైపు తాజా ఘటనకు సంబంధించిన వీడియోను ది వాషింగ్టన్ సన్ మీడియా సంస్థకు చెందిన మార్టిన్ ఆస్టర్ మూలె అనే జర్నలిస్టు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కారు సైన్ బోర్డుకు ఢీ కొట్టిన వెంటనే కారు నుంచి పొగలు అలుముకున్నాయి. ఇక కారులోంచి బయటకు దిగిన డ్రైవర్ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగాడు. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు జర్నలిస్టు ఆస్టర్ మూలె వెల్లడించారు. ఇక వైట్ హౌజ్ వద్ద ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. 2023 లోనూ ఇలాంటి కారు ప్రమాదమే జరిగింది.

trump news Temporary lock down in the US presidential palace White House due to the car accident

మరోవైపు అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు చెందిన రిపబ్లిక్ పార్టీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమిపై ట్రంప్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు నిజాయితీగా జరిగాయా..? అని ప్రశ్నలు సంధించారు. అయితే ఆయన ఎలాంటి ఆధారాలు చూపించకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+