ప్రధాని మోదీకి జెలెన్ స్కీ సడెన్ ఫోన్ కాల్.. ఏం మాట్లాడారంటే..
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగేళ్లకుపైగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై చర్చించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతియుతంగా ఎలా యుద్ధాన్ని ముగించాలన్న దానిపై ఇరు దేశాధినేతలు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో రష్యాతో యుద్ధాన్ని శాంతియుతంగానే పరిష్కరించుకోవాలన్న విధానాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అలాగే 2022 ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ కు అన్ని రకాలుగా భారత్ సహాయ సహకారాలు అందజేస్తుందని పేర్కొన్నారు. అలాగే భారత్- ఉక్రెయిన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చలు జరిపారు.
ఈ ఫోన్ కాల్ కు సంబంధించిన వివరాలను ప్రధాన మంత్రిత్వ కార్యాలయం తన అధికారిక ఎక్స్ లో పోస్టు చేసింది. భారత్- ఉక్రెయిన్ మధ్య ఉన్న సంబంధాలను మరింత దృఢంగా మార్చేందుకు ఇరు దేశాధినేతలు చర్చించినట్లు స్పష్టం చేసింది. అలాగే అనేక రంగాల్లో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొంది. " రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని దౌత్య పరంగా, శాంతి యుతంగా ముగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత్ అన్ని రకాలుగా సాయం చేస్తుంది" అని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం పోస్టులో వివరించింది.

ఇక 2022 లో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్, రష్యా ఇరు దేశాధినేతలతోనూ టచ్ లో ఉన్నారు. అలాగే 21 వ శతాబ్దం యుద్ధానికి సంబంధించిన శకం కాదని ప్రధాని మోదీ అనేక సార్లు ప్రస్తావిస్తూ వచ్చారు. దేశాల మధ్య ఉన్న సమస్యలను శాంతియుతంగా.. దౌత్య పరంగా పరిష్కరించాలని సూచనలు చేశారు. అంతకుముందు సెప్టెంబర్ లో న్యూ దిల్లీలో జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని మోదీ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ తో యుద్ధంతో పాటు పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధంపైనా చర్చలు జరిపారు. ఇక ఆ తర్వాత రష్యా- ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ పంపిన ప్రపోజల్ ను రష్యా స్వాగతించిన సంగతి తెలిసిందే.
Glad to have had a productive telephone conversation with President Zelenskyy. We reviewed our wide-ranging bilateral cooperation and agreed to further strengthen India-Ukraine ties.I thanked President Zelenskyy for sharing his perspectives on the ongoing conflict, its humanitarian aspects and various efforts to restore peace. Reiterated India’s firm commitment to contributing in every possible way towards a peaceful resolution.@ZelenskyyUA
— Narendra Modi (@narendramodi) November 9, 2026
ఇక ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇరు దేశాల మధ్య సంధి కుదుర్చేందుకు అమెరికా ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ మేరకు త్రైపాక్షిక చర్చలు అబుదాబిలో నవంబర్ 10 మంగళవారం జరగనున్నాయి.












Click it and Unblock the Notifications
