Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్

దేశంలో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా ఇండేన్ ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్ సిస్టమ్ సాంకేతిక కారణాలతో కుప్పకూలిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే 8 నుండి 10 రెట్లు అధికంగా కాల్స్ రావడంతో సర్వర్లపై విపరీతమైన భారం పడి సిస్టమ్ క్రాష్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి తోడు గృహ వినియోగ సిలిండర్ల సరఫరా ఏకంగా 50 శాతం మేర తగ్గిపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల తోపులాటలు, గందరగోళం నెలకొంది.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం కనీస నిరీక్షణ సమయాన్ని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచింది. అయితే, చివరి డెలివరీ తర్వాత 25 రోజులు పూర్తి కాకముందే బుక్ చేయడానికి ప్రయత్నించే కస్టమర్లను నిరోధించే వ్యవస్థ టెలికాం నెట్‌వర్క్ స్థాయిలో లేకపోవడంతో, ప్రతి కాల్ ఐవీఆర్ఎస్ (IVRS), మిస్డ్ కాల్ అప్లికేషన్లకు చేరుతోంది. ఈ అసాధారణ ట్రాఫిక్ వల్ల మొత్తం నెట్‌వర్క్ స్తంభించిపోయింది. ఫలితంగా ఫోన్ కాల్స్ కలవక, సిలిండర్లు అందక జనం ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.

Indane LPG Booking System Crashes 50 PC Supply Cut Sparks Chaos Across India Amid Unprecedented Call Volume

50% తగ్గిన సరఫరా.. పెరిగిన డిమాండ్!

గ్యాస్ పంపిణీదారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్‌లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. సరఫరా సగానికి పడిపోగా, డిమాండ్ మాత్రం 50 శాతం పెరిగింది. బుకింగ్ కావట్లేదని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు వస్తున్న జనం, అక్కడ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. గతంలో ఒకట్రెండు రోజుల్లో వచ్చే సిలిండర్, ఇప్పుడు వారం దాటినా రాకపోవడంతో సామాన్యులు గోడౌన్ల వద్దకు వెళ్లి నేరుగా సిలిండర్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మిస్డ్ కాల్ తో బుకింగ్ సులభం!

సర్వర్లపై భారం తగ్గించేందుకు వినియోగదారులు ఫోన్ కాల్స్ కంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కంపెనీ కోరుతోంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత లేదా రాత్రి వేళల్లో బుకింగ్ ప్రయత్నిస్తే సులభంగా అవుతుందని సూచించింది.

1. ఇండేన్ గ్యాస్ (Indane):

  • వాట్సాప్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 75888 88824కు 'REFILL' అని మెసేజ్ పంపండి.
  • మిస్డ్ కాల్: 84549 55555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
  • SMS: 77189 55555 నంబర్‌కు మెసేజ్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు.

2. హెచ్‌పీ గ్యాస్ (HP Gas):

  • వాట్సాప్: 92222 01122 నంబర్‌కు 'Hi' అని పంపండి.
  • మిస్డ్ కాల్: 94936 02222 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
  • యాప్: 'HP Pay' యాప్ లేదా అమెజాన్, పేటీఎం ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+