జగన్‌తో బీజేపీ చర్చలు జరుపుతోందా?: మోడీపై బాబు 'స్నేహ' అస్త్రం, పొత్తును తేల్చేది అవే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 'మిత్రధర్మం' పేరుతో జాతీయస్థాయిలో బీజేపీని ఇరుకున పెడుతున్నారు. ఇప్పటికే శివసేన దూరమైంది. అకాలీదళ్ వంటి పలు పార్టీలు టీడీపీకి మద్దతు పలుకుతున్నాయి.

'అనూహ్యంగా' పవన్ కళ్యాణ్‌కు జగన్ చెక్, బాబుకు నో 'ఛాన్స్'?

ఈ నేపథ్యంలో బీజేపీ కూడా టీడీపీతో పొత్తు విషయంలో ఓ అడుగు వెనక్కి వేసింది. ఏపీ బీజేపీ నేతలు కొందరు టీడీపీతో ముందుకు సాగడం శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. సొంతగా ముందుకు వెళ్తేనే లాభముంటుందని ఎప్పటికప్పుడు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు.

మీకు మాకు కాదు: బీజేపీతో కొట్లాటపై టీడీపీ ట్విస్ట్, మోడీపై యుద్ధమే: గల్లా జయదేవ్ ఘాటుగ

 జాతీయస్థాయిలో ఇరుకునపెట్టేలా ఆయుధం

జాతీయస్థాయిలో ఇరుకునపెట్టేలా ఆయుధం

పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు 2019లో ఒంటరిగా పోరు చేయడమే మంచిదని ఢిల్లీ పెద్దలకు చెప్పారని అంటారు. అధిష్టానం కూడా ఆ దిశలో ఆలోచన చేసింది. అదే సమయంలో బడ్జెట్‌పై టీడీపీ అసంతృప్తి, విభజన హామీల అంశం చర్చనీయాంశంగా మారింది. మిత్రధర్మం పేరుతో చంద్రబాబు.. ఏపీ విషయాన్ని పక్కన పెడితే జాతీయస్థాయిలోనే బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యవహరించారని చెప్పవచ్చు.

 ఏపీ బీజేపీ నేతల సూచనలు పక్కన పెట్టేలా చేసిన బాబు

ఏపీ బీజేపీ నేతల సూచనలు పక్కన పెట్టేలా చేసిన బాబు

ఎన్డీయేలోని పెద్ద, ముఖ్యమైన పార్టీ బయటకు వెళ్తే అందరికీ తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆలోచనతో కూడా బీజేపీ తాడేపోడే తేల్చుకోవడం కంటే లెక్కలతో టీడీపీని ఇరుకున పెట్టాలని భావించింది. ఇప్పుడు బీజేపీ, టీడీపీల మధ్య లెక్కల పోరు నడుస్తోంది. మొత్తానికి చంద్రబాబు 'మిత్రధర్మం' అస్త్రం ఏపీ సొంత పార్టీ నేతల సూచనలను పక్కన పెట్టేలా, బీజేపీ పునరాలోచనలో పడేలా చేసిందని అంటున్నారు.

జగన్‌తో బీజేపీ చర్చలు జరుపుతోందా?

జగన్‌తో బీజేపీ చర్చలు జరుపుతోందా?

మరోవైపు, ఏపీకి కేంద్రం అవసరం, 2019 ఎన్నికల దృష్ట్యా ఇంకా టీడీపీ కూడా బీజేపీతో అప్పుడే దోస్తీని తెంచుకోలేకపోతోంది. తాము వెళ్లిపోతే వైసీపీ వచ్చి చేరుతుందనే ఆందోళన ఉంది. గత ఏడాది హైదరాబాదులో జగన్ కొందరు బీజేపీ మద్దతుదారులతో చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. బీజేపీలోని కొందరు ఏపీ నేతలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ బీజేపీతో పొత్తు కోసం చూస్తోందని టీడీపీ ఎప్పటికప్పుడు ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను బట్టి ఎన్నికలు సమీపిస్తున్నందున బీజేపీతో వైసీపీ లోలోన చర్చలు జరుపుతోందా అనే అంశం తేలాల్సి ఉంది. ఇప్పుడు అనూహ్యంగా జగన్ రాజీనామా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు.

 బాబు కీలక నిర్ణయం ఎప్పుడు?

బాబు కీలక నిర్ణయం ఎప్పుడు?

బీజేపీతో దోస్తీ విషయంలో టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. కారణాలు ఏవైనా గుజరాత్‌లో బీజేపీ చచ్చీ చెడి గెలిచింది. రాజస్థాన్‌లో రెండు లోకసభ స్థానాలు కోల్పోయింది. చంద్రబాబు కూడా దేశవ్యాప్తంగా బీజేపీకి ఎలా ఉంది అన్న పరిణామాలను గమనిస్తున్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ సత్తా మరింత తెలిసిపోతుంది. కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.

 కర్నాటక ఎన్నికల తర్వాత బాబు అడుగు

కర్నాటక ఎన్నికల తర్వాత బాబు అడుగు

తొలుత, గత ఆదివారమే కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం సాగింది. బీజేపీతో కటీఫ్ చెబుతారని అందరూ భావించారు. ఆ తర్వాత మొన్న బడ్జెట్ తొలి సమావేశాలు ముగిసే వరకు కేంద్రం నుంచి హామీ రాకుంటే తాడేపేడో తేల్చుకుంటారని భావించారు. కానీ ఇప్పుడు మార్చి 5 వరకు అని టిడిపి చెబుతోంది. మార్చి 5 వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నామని టీడీపీ ఎంపీలు చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం కర్నాటక ఎన్నికల్లో పరిస్థితి తర్వాత అడుగేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka could well decide if the Telugu Desam Party and the BJP would stay friends in neighbouring Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి