ఇక పెట్రోల్ టెన్షన్ లేదు.. ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేసాయ్!

Hero Flex Fuel Bikes: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి ఫ్లైక్స్-ఫ్యూయల్ బైకులను అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సరికొత్త బైకులను లాంచ్ చేశారు. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ మోడళ్లను ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇవి దేశంలోనే మొదటి 100సీసీ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిళ్లు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, హీరో మోటోకార్ప్ సీఈవో హర్షవర్దన్ చిత్రే కూడా పాల్గొన్నారు.

ఈ సరికొత్త బైకులు సాధారణ పెట్రోల్‌తోనే కాకుండా అధిక ఇథనాల్ మిశ్ర‌మం కలిగిన ఫ్యూయల్‌తో కూడా సులభంగా నడుస్తాయి. ఇవి E20(20 శాతం ఇథనాల్) నుంచి E85(85 శాతం ఇథనాల్) వరకు ఎలాంటి ఫ్లైక్స్ ఫ్యూయల్‌నైనా సపోర్ట్ చేస్తాయని కంపెనీ వెల్లడించింద. దీనివల్ల పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. హీరో మోటోకార్ప్ తన ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకుల శ్రేణిని జులై 2026 నుంచి ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొదట విడుదల చేయనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Hero Flex Fuel Bikes Nitin Gadkari Launches Ethanol-Powered Splendor Plus and HF Deluxe

ధరల వివరాలు ఇలా..
ఇక ధరల విషయానికి వస్తే.. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లైక్స్ ఫ్యూయల్ ధర రూ.72,792గా నిర్ణయించగా.. స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధరను రూ.82,710గా కంపెనీ ఖరారు చేసింది. ఫీచర్ల పరంగా చూస్తే ఈ రెండు బైకులలోనూ 97.2సీసీ ఇంజన్ అమర్చారు. ఇది E85 ఇంధనంతో 6.3 kW పవర్, 8.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ మోడళ్లతో పోలిస్తే ఇవి మెరుగైన పర్ఫార్మెన్స్ ఇస్తాయని కంపెనీ పేర్కొంది. వీటిలో సరికొత్త డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హీరో పేటెంట్ i3S స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ ఫీచర్, ట్యూబ్‌లెస్ టైర్లతో పాటు కొత్త బ్లాక్ అండ్ లైమ్ ఎల్లో గ్రాఫిక్స్ అందించారు.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతిని.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 25 నుంచి 30 శాతానికి (E25, E30) పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆటోమొబైల్ సంస్థలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను తేవాలని మంత్రి నితిన్ గడ్కరీ ఎప్పటికప్పుడు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 5న మారుతి సుజుకి తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేయనుండగా.. 2027 ప్రారంభంలో టాటా మోటార్స్ కూడా తమ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. గతంలో హోండా, సుజుకి సంస్థలు రేంజ్ బైకులను తెచ్చినప్పటికీ, సామాన్యులకు అందుబాటులో ఉండేలా మాస్ మార్కెట్లోకి 100సీసీ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులను తెచ్చిన మొదటి బ్రాండ్‌గా హీరో మోటోకార్ప్ రికార్డు సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+