జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. వారసుల రాజకీయ పోరుకు రంగం సిద్దం అవుతోంది. వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన సంకేతాలు ఇచ్చారు. కాగా.. మారుతున్న పరిస్థితులు.. భవిష్యత్ ఆలోచనలతో జగన్ కుమార్తె రాజకీయాల్లో ప్రవేశించిందేకు ముహూర్తం ఫిక్స్ అయింది. జగన్ ఇద్దరు కుమార్తె లు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉన్నత విద్య.. ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. కాగా, ఇప్పుడు జగన్ పెద్ద కుమార్తె ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు.
వైఎస్సార్ బిడ్డలుగా జగన్ - షర్మిల ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి మరణం తరువాత అనేక రాజకీయ ఆటు పోట్లు ఎదుర్కొన్న జగన్ అయిదేళ్లు సీఎంగా పని చేసారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాగా.. జగన్ తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగిస్తున్నారు.

షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది. జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలతో ఉంటున్నారు. కాగా, జగన్ మొత్తంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ నేతలు ఉన్నా.. పార్టీకి జగన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. జగన్ సతీమణి భారతి ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో షర్మిల, విజయమ్మ వైసీపీ కోసం... జగన్ కు మద్దతుగా నిలిచారు.
ప్లీనరీ వేదికగా ప్రకటనకు ఛాన్స్..!
కాగా, ఇప్పుడు వారు జగన్ తో దూరంగా ఉన్నారు. ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే పార్టీ ప్లీనరీ వేదికగా తన కుమార్తెను పార్టీ శ్రేణులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర సమయంలో హర్షా పార్టీ వ్వవహారాలను పర్యవేక్షిస్తారని చెబుతున్నారు. అదే విధంగా 2029 ఎన్నికల్లో కడప నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేయటం దాదాపు ఖాయమని తెలుస్తోంది.
మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ వేళ హర్షా రెడ్డి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. జగన్ సైతం రాజకీయంగా తొలి సారి కడప నుంచి ఎంపీగా పోటీ చేసారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా వై ఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. షర్మిల సైతం కడప నుంచే తొలి సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. అటు షర్మిల కుమారుడు రాజారెడ్డి వచ్చే ఎన్నికల్లొ పొటీ చేస్తారనే ప్రచారం వేళ.. ఇప్పుడు జగన్ కుమార్తె అటు సాక్షి వ్యవహారాలతో పాటుగా రాజకీయంగానూ ఎంట్రీ ఖాయం కావటంతో.. వచ్చే ఎన్నికల వేళ వారసుల పోటీ ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications