హైదరాబాద్ నడి బొడ్డున ట్రంప్ టవర్స్ - 65 అంతస్థులు, కళ్లు చెదిరేలా..!!

హైదరాబాద్ నడిబొడ్డున ట్రంప్ టవర్స్ సిద్దం అవుతున్నాయి. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్‌లో 4 ఎకరాల విస్తీర్ణంలో 65 అంతస్తులతో 22 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు, 16 పెంట్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. దక్షిణాదిలోనే అతి పెద్ద ఎత్తైన టవర్స్ గా ఇవి నిర్మాణం జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'ట్రంప్ ఆర్గనైజేషన్' నిర్మిస్తోంది.

హైదరాబాద్ నడి బొడ్డున ట్రంప్ టవర్స్ పేరుతో భారీ నిర్మాణం చేపట్టారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'ట్రంప్ ఆర్గనైజేషన్' నిర్మిస్తోంది.ఈ ప్రాజెక్ట్ వివరాలను ట్రెబెకా వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఇరా రియల్టీ వ్యవస్థాపకుడు నర్సిరెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం భూమి విలువ మినహా రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కల్పేష్ మెహతా వివరించారు. ఈ ఏడాది చివరికల్లా నిర్మాణ పనులు ప్రారంభించి, రాబోయే నాలుగేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫ్లాట్ల అమ్మకాల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్‌లో 4 ఎకరాల విస్తీర్ణంలో 65 అంతస్తులతో రెండు ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నట్లు వారు తెలిపారు.

 శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!
శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!
trump-towers-hyderabad-will-feature-two-65-storey-glass-fa-ade-towers-rising-around-800-feet-linke

దక్షిణాదిలొనే తొలి నిర్మాణం

ఈ ప్రాజెక్టు మొత్తం 22 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు, 16 పెంట్‌హౌస్‌లు ఉంటాయని వెల్లడించారు. కాగా.. ట్రంప్ టవర్స్‌లో 3.5, 4 బీహెచ్‌కే ఫ్లాట్ల ధరలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉంటాయని వివరించారు. ఇప్పటివరకు 8 పెంట్‌హౌస్‌లను రూ.250 కోట్లకు విక్రయించినట్లు, అందులో ఒక పెద్ద పెంట్‌హౌస్ రూ.62 కోట్లకు విక్రయించినట్లు తెలిపారు. భారత్ లో ట్రంప్ బ్రాండ్ కు ఇది ఎనిమిదో ప్రాజెక్టుగా చెప్పుకొచ్చారు. 2014 లో భారత్ లో ప్రవేశించిన ఈ సంస్థ ఇప్పటికే ముంబై, పూణె, గురుగ్రామ్, నోయిడా, కోల్‌కతాలలో ప్రాజెక్టులను చేపట్టింది. కాగా, దక్షిణ భారతదేశంలో ఇదే తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. RERA రికార్డు ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 2031 మే 15 గడువుగా నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+