AP rains: ఏపీకి తీవ్ర వాయుగుండం ముప్పు-ఈ జిల్లాల్లో 4 రోజులు భారీవర్షాలు..!

పశ్చిమ మధ్య, ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా బలపడి, ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని (Heavy Rain Alert) రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఏపీకి మరో చల్లని కబురు- రేపటి నుంచి మళ్లీ వర్షాలు-ఈ జిల్లాల్లో..!
ఏపీకి మరో చల్లని కబురు- రేపటి నుంచి మళ్లీ వర్షాలు-ఈ జిల్లాల్లో..!

మంగళవారం అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్ద తెలిపింది.
బుధవారం అల్లూరి, పోలవరం,ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Heavy Rain Alert for AP Districts for Next 4 Days as Cyclonic System Develops
AP Rain Alert: దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం- 24 గంటల్లో అతి భారీ వర్షాలు....!
AP Rain Alert: దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం- 24 గంటల్లో అతి భారీ వర్షాలు....!

తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా కోస్తా తీరం వెంబడి గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇవాళ సాయంత్రం నాటికి కాకినాడ జిల్లా శంఖవరంలో 60.7 మిమీ, ఎన్టీఆర్ జిల్లా నందలూరులో 52.5మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 48.2మిమీ, నంద్యాల జిల్లా దుర్వేసిలో 45.5మిమీ, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 45.3మిమీ,చిత్తూరు జిల్లా రామకుప్పంలో 39.3మిమీ, అనంతపురం జిల్లా డి.హీరేహాల్ 35.5మిమీ, కర్నూలు జిల్లా పత్తికొండలో 31.5 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+