బంగారం ధరల్లో బిగ్ బూమ్- ముందుంది అసలు పండగ

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కారణంగా నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ఒక శాతం మేర వీటి రేట్లు పెరిగాయి. మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎంసీఎక్స్ అక్టోబర్ ఫ్యూచర్ గోల్డ్ కాంట్రాక్టులు 1,58,000 రూపాయల మార్క్ ను దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ ఉదయం ఎంసీఎక్స్‌ లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ఒక శాతం మేర పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,54,700 వద్ద ట్రేడ్ అయింది. అదే విధంగా సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ధర సైతం 0.89 శాతం లాభ పడింది. కిలో 2,37,749 రూపాయల వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో యూఎస్ డిసెంబర్ గోల్డ్ కాంట్రాక్ట్స్ దాదాపు ఒక శాతం వృద్ధిని నమోదు చేశాయి. ట్రాయ్ ఔన్స్ 4,474 డాలర్లకు పెరిగింది.

Gold and Silver Prices Surge at MCX and Comex Traded Higher macroeconomic triggers Rally

హైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,54,860, 22 క్యారెట్లు రూ.1,41,196 వద్ద నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,54,486, 22 క్యారెట్లు రూ.1,41,950 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల 20 గ్రాముల బంగారం రూ.1,54,860 కాగా 22 క్యారెట్లు రూ.1,41,950 వద్ద నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,54,438, 22 క్యారెట్లు రూ.1,44,000 వద్ద కొనసాగుతోంది.

నేడు జగన్ కీలక భేటీ: తాడేపల్లి కేంద్రంగా.. పొలిటికల్ స్ట్రాటజీ
నేడు జగన్ కీలక భేటీ: తాడేపల్లి కేంద్రంగా.. పొలిటికల్ స్ట్రాటజీ

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,438, 22 క్యారెట్లు - రూ. 14,000, 18 క్యారెట్లు - రూ. 11,931

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,486, 22 క్యారెట్లు- రూ. 14,195, 18 క్యారెట్లు - రూ. 11,614

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,486, 22 క్యారెట్లు- రూ. 14,195, 18 క్యారెట్లు - రూ. 11,614

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,486, 22 క్యారెట్లు- రూ. 14,195, 18 క్యారెట్లు - రూ. 11,614

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,486, 22 క్యారెట్లు- రూ. 14,195, 18 క్యారెట్లు - రూ. 11,614

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,486, 22 క్యారెట్లు- రూ. 14,195, 18 క్యారెట్లు - రూ. 11,614

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+