'మెగా 158' టైటిల్ లీక్ చేసిన చిరు..? టైటిల్ తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే..!

మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకర వర ప్రసాద్' మూవీ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ రీజినల్ హిట్ గా నిలిచింది. అలాగే చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. 'మెగా 158'అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

అయితే ఈ మూవీ టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫ్యాన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ టైటిల్ విషయంలో హింట్ ఇచ్చారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు చిరంజీవి. ఈ కార్యక్రమం మెగా అభిమానుల జోష్ మధ్య సందడిగా సాగింది. ఈ ఈవెంట్ మెగా 158 సినిమాపై చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో సరదాగా సంభాషిస్తున్న సమయంలో చిరంజీవి ఒక్కసారిగా టంగ్ స్లిప్ అయ్యారు. టీజర్ మ్యూజిక్ పూర్తయిందా..? టీజర్ చివరలో 'కదిరి' అనే టైటిల్‌ ను చూపించారా..? అంటూ చిరంజీవి ప్రశ్నించారు.

అనుకోకుండా కదిరి అనే పదాన్ని ప్రస్తావించిన చిరంజీవి.. వెంటనే అలర్ట్ అయి తన ప్రసంగాన్ని ఆపేశారు. అయితే చిరు నోటి వెంట వచ్చిన ఆ ఒక్క పదం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాబీ- చిరు కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ 'కాకాజీ' అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కదిరి అని చిరు పలకడంతో మెగా 158 టైటిల్ 'కదిరి కాకాజీ' అని నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని ఇప్పటికే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో కదిరి అనే టైటిల్ పెట్టే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

chiranjeevi latest Here is the title for Megastar s 158th film Teaser release date finalized

గతంలో చిరు- బాబీ కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'కదిరి' టీజర్‌ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు మెగా అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ప్రియమణి, అనస్వర రాజన్, రచితా రామ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+