IPL 2027: కుదరని బేరాలు..! పాత గూటికి హార్దిక్ పాండ్యా? కెప్టెన్సీ ఇచ్చేందుకు మాత్రం నో ..!

ఐపీఎల్ 2027 (IPL 2027) మెగా వేలానికి ముందే ముంబై ఇండియన్స్ ను వీడి ఏదో ఒక టీమ్ లోకి వెళ్లి కెప్టెన్సీ సాధించుకోవాలన్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు కోల్ కతా నైట్ రైడర్స్ తో సాగిన బేరసారాలు చివరి నిమిషంలో విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో తిరిగి తన పాత జట్టులోకి వెళ్లిపోయేందుకు హార్జిక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు ఓ కండిషన్ కూడా పెడుతున్నాడట. అదే కెప్టెన్సీ.

IPL 2027: ఐపీఎల్ లో ఎంట్రీకి పాక్ క్రికెటర్ ? -బీసీసీఐ నిర్ణయంపై ఉత్కంఠ ?
IPL 2027: ఐపీఎల్ లో ఎంట్రీకి పాక్ క్రికెటర్ ? -బీసీసీఐ నిర్ణయంపై ఉత్కంఠ ?

నిన్న మొన్నటివరకూ హార్దిక్ పాండ్యాను తీసుకుని, ఇతర ఆటగాళ్లను వదులుకునేందుకు సైతం సిద్దమైన చెన్నై, కోల్ కతా ఫ్రాంచైజీలు.. ఆయన షరతులకు అంగీకరించలేక వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు హార్దిక్ తన పాత జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ వైపు చూస్తున్నాడు. హార్దిక్ ను తిరిగి తీసుకునేందుకు గుజరాత్ టైటాన్స్ జట్టు సిద్దంగానే ఉన్నా, కెప్టెన్సీ ఇవ్వాలన్న అతని షరతుకు మాత్రం నో చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ డీల్ ముందుకు సాగడం లేదని సమాచారం.

Hardik Pandya s GT Comeback Hits Roadblock Over Captaincy Demand Ahead of IPL 2027
IPL 2027: ఆ జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ? తుది దశలో మెగా డీల్..!
IPL 2027: ఆ జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ? తుది దశలో మెగా డీల్..!

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకునేందుకు గిల్ సిద్దంగానే ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. అయితే గిల్ స్ధానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించేందుకు గుజరాత్ సిద్దంగా లేదు. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ జట్టు గిల్ సారధ్యంలో ప్లేఆఫ్స్ కు కూడా చేరుకుంది. దీంతో గిల్ స్ధానంలో హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగించేందుకు గుజరాత్ సిద్దంగా లేదు. మరోవైపు హార్దిక్ టీమ్ ఈ వాదనల్ని తోసిపుచ్చుతోంది. హార్దిక్ ఏ ఫ్రాంచైజీతోనూ వ్యక్తిగతంగా లేదా నేరుగా ఎటువంటి చర్చలు జరపలేదని వారు స్పష్టం చేశారు. ఒకవేళ బదిలీలకు సంబంధించిన చర్చలు జరిగితే, ఫ్రాంచైజీల మధ్య ముంబై ఇండియన్స్ ద్వారానే అధికారికంగా జరుగుతాయని తెలిపారు.

Hardik Pandya s GT Comeback Hits Roadblock Over Captaincy Demand Ahead of IPL 2027

2022లో హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2023లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత హార్దిక్ ముంబై ఇండియన్స్ టీమ్‌లోకి వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ తీసుకున్నా.. అభిమానుల విమర్శలు తప్పలేదు. అలాగే సీనియర్లతో విభేదాల వల్ల ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఆశించిన గౌరవం కూడా దక్కలేదు. గత సీజన్ లో అయితే జట్టుతో పాటు హార్దిక్ కూడా విఫలం కావడంతో ముంబై హార్దిక్ ను వదులుకునేందుకు సిద్దమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+