అత్యాచార ఆరోపణలు.. ఐపీఎల్ స్టార్ క్రికెటర్ అరెస్ట్!

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్‌కు కష్టాలు మరింత ముదిరాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వేధించారని ఓ మెడికల్ విద్యార్థిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అభిషేక్ పోరెల్‌ను మంగళవారం ఉదయం హుగ్లీలో అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటలపాటు విచారించిన అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.అరెస్ట్ అనంతరం అభిషేక్ పోరెల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతడిని చిన్సురా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ విచారణను మంగళవారం చేపట్టనున్నారు. అంతకుముందు అభిషేక్ పోరెల్‌ను అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు: రెండేళ్ల నిషేధానికి పీసీబీ సన్నాహాలు!
చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు: రెండేళ్ల నిషేధానికి పీసీబీ సన్నాహాలు!

హుగ్లీలోని మొగ్రా పోలీస్ స్టేషన్‌లో ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అభిషేక్ పోరెల్ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆ యువతి ఆరోపించింది. అభిషేక్ పోరెల్ ఏకాంత క్షణాలను రికార్డ్ చేశాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువత చెప్పిన దాని ప్రకారం.. రెండు కుటుంబాల మధ్య పెళ్లి గురించి చర్చలు జరిగాయి. అయితే ఆ తర్వాత అభిషేక్ పోరెల్‌కు ఇతర మహిళలతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆమెకు తెలిసింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

IPL Cricketer Abishek Porel Arrested in Hooghly Over Physical Harassment Charges Filed by Medical Student

ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఆరోపించబడిన ఈ సంఘటన ఏప్రిల్ 2, 2026న ఢిల్లీలో జరిగింది . ఆ యువతి తన ఫిర్యాదులో అభిషేక్ పోరెల్ తనను అక్రమంగా నిర్బంధించి ఆహారం కూడా ఇవ్వలేదని ఆరోపించింది .ఆమెను ఉద్దేశపూర్వకంగా ఒంటరిగా వదిలేశాడని, దాని ఫలితంగా ఆమె శారీరక పరిస్థితి ఎంతగా బలహీనపడిందంటే సరిగ్గా నడవలేకపోయిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొనబడింది. గాయాల కారణంగా వైద్య సహాయం తీసుకోవలసి వచ్చిందని కూడా ఫిర్యాదులో తెలిపింది. ఈ కేసులో కలకత్తా హైకోర్టు అరెస్టుకు ఆదేశించడంతో పాటు బాధితురాలి ఫోటోలను ప్రచారం చేయకూడదని కూడా ఆదేశించింది. అభిషేక్ పోరెల్ ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోర్టు మొగ్రా పోలీసులను ఆదేశించింది .

నందమూరి వారసురాలి గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్‌గా ఎంట్రీ ఫిక్స్!
నందమూరి వారసురాలి గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్‌గా ఎంట్రీ ఫిక్స్!

ఈ క్రమంలో మంగళవారం పోలీసులు మొదట అభిషేక్ పోరెల్ ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని వైద్య పరీక్ష కోసం తీసుకెళ్లి, చిన్సురా కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసులోని ఆరోపణలు ఫిర్యాదులో నమోదు చేయబడిన వివరాలు మాత్రమే. కోర్టులో జరిగే తదుపరి న్యాయ విచారణలో ఈ ఆరోపణలు నిర్ధారించబడతాయి.

అభిషేక్ పోరెల్ క్రికెట్ కెరీర్
అభిషేక్ పోరెల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 35 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి, 769 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ స్ట్రైక్ రేట్ 145కు పైగా ఉంది. 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.4 కోట్లకు రీటైన్ చేసుకుంది. అభిషేక్ పోరెల్ 2023లో రిషబ్ పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. 23 ఏళ్ల అభిషేక్ పోరెల్ బెంగాల్ తరఫున దేశీయ క్రికెట్ ఆడాడు. అతను 32 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఒక సెంచరీతో సహా 1408 పరుగులు చేశాడు. అతను 23 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో రెండు సెంచరీలతో సహా 833 పరుగులు చేశాడు. అభిషేక్ 61 టీ20 మ్యాచ్‌లలో 1590 పరుగులు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+