రోహిత్, కొహ్లీ ఇన్, హార్ధిక్ అవుట్..! విండీస్ తో వన్డేలకు భారత జట్టు ఇదే..!

ఈ నెల 27 నుంచి స్వదేశంలో వెస్టిండీస్ తో (West Indies) జరిగే వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం భారత జట్టును (India ODI Squad) బీసీసీఐ ప్రకటించింది. ఇందులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మరోసారి వన్డే జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ నేతృత్వంలోనే ఈ సిరీస్ ఆడబోతోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలపై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. హార్దిక్ పాండ్యాకు మాత్రం జట్టులో చోటు లభించలేదు. ఇద్దరు కుర్రవాళ్లు జట్టులో తొలిసారి ఎంట్రీ ఇస్తున్నారు.

అజిత్ అగార్కర్ వారసుడు ఖరారు ? ఛీఫ్ సెలెక్టర్ గా బీసీసీఐ అనూహ్య ఎంపిక..!
అజిత్ అగార్కర్ వారసుడు ఖరారు ? ఛీఫ్ సెలెక్టర్ గా బీసీసీఐ అనూహ్య ఎంపిక..!

వెస్టిండీస్ తో ఈ నెల 27న ప్రారంభమయ్యే 3 వన్డేల సిరీస్ కు 15 మంది సభ్యులతో భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తో పాటు ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీని జట్టులో కొనసాగించారు. అదే సమయంలో యువపేసర్ ఆకిబ్ నబీ, యువ ఆల్-రౌండర్ నమన్ ధీర్ తొలిసారిగా జట్టులోకి వచ్చారు. ఈ నెలాఖరులో టీ20 క్రికెట్‌లోకి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ హార్దిక్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అక్టోబర్ 6న పుదుచ్చేరిలో ఆస్ట్రేలియా 'ఎ' తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇండియా 'ఎ' జట్టులో మాత్రం హార్దిక్ చోటు దక్కించుకున్నాడు.

Rohit Kohli Retained in India ODI Squad for West Indies Series Hardik Pandya Left Out Two new faces
IPL 2027: హార్ధిక్ కోసం ఆయుష్ కు సీఎస్కే నో..! బదులుగా ముంబైకి ఆఫర్ ఇదే..!
IPL 2027: హార్ధిక్ కోసం ఆయుష్ కు సీఎస్కే నో..! బదులుగా ముంబైకి ఆఫర్ ఇదే..!

విండీస్ తో వన్డే సిరీస్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుండటంతో.. హార్దిక్‌ను నేరుగా పూర్తి స్థాయి అంతర్జాతీయ మ్యాచ్‌లోకి తీసుకురాకూడదని సెలెక్టర్లు నిర్ణయించారు. వన్డే క్రికెట్‌కు తిరిగి వచ్చే ముందు, 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేయడం, 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయగల అతని సామర్థ్యం కూడా కీలకమైన అంశంగా మారనుంది. హార్దిక్ గైర్హాజరీలో సీమ్-బౌలింగ్ ఆల్-రౌండర్ ఎంపికల విషయంలో భారత్‌కు పరిమిత అవకాశాలు ఉన్నాయి. మరో ప్రత్యామ్నాయమైన నితీష్ కుమార్ రెడ్డి విండీస్ సిరీస్ సమయంలో ఆసియా క్రీడల కోసం భారత బృందంతో కలిసి జపాన్‌లో ఉంటారు. సూర్యాన్ష్ షెడ్జే, వెంకటేష్ అయ్యర్ గాయాల కారణంగా అందుబాటులో లేరు. ఈ పరిస్థితుల్లో నమన్ ధీర్‌కు తొలిసారిగా వన్డే జట్టులో పిలుపు లభించింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ జట్టులోని ఇతర స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు కాగా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ ఛాయిస్ గా ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ విభాగంలో అదనపు బలాన్ని చేకూర్చనుండగా, రాహుల్‌తో పాటు ధ్రువ్ జురెల్ రెండో వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. వన్డే సిరీస్ తర్వాత వెస్టిండీస్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+