ఆ విషయంలో ఏడు స్థానాలకు పడిపోయిన భారత్.. గతేడాదితో పోల్చితే..!

ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) నిలిచింది. మొత్తం 199 దేశాల పాస్‌ పోర్ట్‌ లను ఈ ర్యాంకింగ్ కోసం విశ్లేషించారు. అయితే భారత్ పాస్ పోర్ట్ ఈ ఏడాది 73 వ స్థానంలో ఉంది. గతేడాది 66 వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 7 స్థానాలు దిగజారింది. ఇక అఫ్గానిస్తాన్ అన్ని దేశాల కంటే చివరిస్థానంలో అంటే 199 వ స్థానాన్ని సరిపెట్టుకుంది. ఈ ఇండెక్స్ ను ఆర్టన్ క్యాపిటల్ అనే సంస్థ వెల్లడించింది. ప్రపంచ దేశాల పాస్ పోర్ట్ లను ఆయా దేశాల్లో వీసా ఫ్రీ నిబంధనలు, వీసా ఆన్ ఆరైవల్ రూల్స్, మొబిలిటీ స్కోర్ ఆధారంగా అంచనా వేస్తారు. మొబిలిటీ స్కోర్ ఎక్కువగా ఉన్న దేశాల పాస్ పోర్టు శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో యూఏఈ దేశం మొబిలిటీ స్కోర్ 181 గా ఉంది. అందుకే ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ను కలిగి ఉంది.

యూఏఈ వీసా కలిగిన వాళ్లు ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో వీసా లేకుండా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అలాగే 43 దేశాలకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కలిగి ఉంది. మరో 17 దేశాలకు మాత్రమే వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక భారత్ విషయానికి వస్తే ప్రపంచ పాస్ పోర్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ 73 వ స్థానంలో ఉంది. భారత్ లో మొబిలిటీ స్కోర్ 69 గా ఉంది. భారత్ తో పాటు జింబాబ్వే, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ, వియత్నాం దేశాల్లో కూడా మొబిలిటీ స్కోర్ 69 గా ఉంది. ఇక భారత్ పాస్ పోర్టు కలిగిన వాళ్లు 25 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అలాగే 39 దేశాలకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. ఇక 129 దేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా వీసా తీసుకోవాలి.

India Passport rank latest The UAE holds the world s most powerful passport where does India rank

అయితే గతేడాది 66 వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది ఏకంగా 7 స్థానాలు పడిపోయి 73 వ స్థానానికి చేరింది. గతేడాది మొబిలిటీ స్కోర్ 73 కాగా ఈ ఏడాది మొబిలిటీ స్కోర్ 69 గా ఉంది. గతేడాది లెక్కల ప్రకారం భారత్ పాస్ పోర్టు కలిగినవాళ్లు 125 దేశాల్లో వీసా తీసుకోవాల్సి ఉండగా ఈ ఏడాది మరో నాలుగు దేశాల్లోనూ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఓ ప్రైవేట్ సంస్థ చేపట్టిన ఈ గ్లోబల్ సర్వేను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు. పలు ప్రైవేట్ సంస్థలు ఏకపక్షంగా నిర్ణయించిన పారామీటర్ల ఆధారంగా ఈ నివేదికలను రూపొందిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+