కుప్పకూలిన బంగారు గని.. 67 మంది మృతి.. ఎక్కడంటే..?

సూడాన్ లోని ఓ మారుమూల ప్రాంతంలో బంగారు గని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 67 మంది మృతి చెందారు. వెస్ట్ కొర్దోఫాన్ ప్రావిన్స్ లోని నుహుద్ టౌన్ లో ఉన్న అల్- జరా గోల్డ్ మైన్ లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ గోల్డ్ మైన్ ను పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(RSF) దళాల ఆధీనంలో ఉంది. ఈ దళం సూడాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడేళ్లకు పైగా యుద్ధం చేస్తోంది. ఈ ఘటనపై ది సూడాన్ డాక్టర్స్ నెట్ వర్క్ స్పష్టం చేస్తూ.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ గోల్డ్ మైన్ ను చట్ట పరంగా కాకుండా రెగ్యులర్ కార్మికులతో కాకుండా స్థానికులతో తవ్వకాలు జరుపుతున్నారని అలాగే ఆ గని వద్ద ఎలాంటి భద్రతా పరికారాలు, ముందస్తు రక్షణ చర్యలు లేవని పేర్కొంది. మరోవైపు ఈ ప్రమాదంపై స్థానిక యంత్రాంగం ది అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ 82 మంది మృతదేహాలను వెలికి తీశామని తెలిపింది. అలాగే డజన్ల కొద్దీ గల్లంతయ్యారని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఓ అధికారి మాట్లాడుతూ.. ఆదివారం నుంచే ఈ గోల్డ్ మైన్ లోని ఓ షాఫ్ట్ వద్ద పగుళ్లు వచ్చాయని.. అక్కడి నుంచి క్రమంగా విస్తరిస్తూ ఇవాళ బంగారు గని కుప్పకూలిందని అన్నారు.

ఈ గని వద్ద ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన ఒకే ఒక్క లిఫ్ట్ మాత్రమే ఉందని వివరించారు. దాంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అన్నారు. ఈ క్రమంలోనే అధిక సంఖ్యలో చిక్కుకున్నవారిని కాపాడలేకపోయామని వివరించారు. ఇక ఇదే ఘటనపై ది కొర్దోఫాన్ అబ్జర్వేటరీ మానిటరింగ్ గ్రూప్ స్పందిస్తూ.. బంగారు గని కుప్పకూలిన ఘటనలో కనీసం 70 మందికి పైగా మృతి చెందారని పేర్కొంది. మృతులంతా స్థానిక కార్మికులను స్పష్టం చేసింది. ఇక ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన సయిద్ గబారా అనే మహిళ మాట్లాడుతూ.. బొగ్గు గని చాలా దూరం కుప్పకూలిందని.. ఈ శిథిలాలను తొలగించేందుకు అవసరమైన మెషినరీ ప్రస్తుతం అందుబాటులో లేదని తెలిపింది.

Sudan Major tragedy Gold mine collapses 67 dead Major tragedy in Sudan Gold mine collapses 67 dead

ఇక ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో సూడాన్‌ ఒకటి. కానీ ఇక్కడ గనుల భద్రత ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే మారుతోంది. కార్మికులకు సరైన భద్రతా ఏర్పాట్లు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఇప్పటికే సూడాన్‌ లో ఆర్ధిక సంక్షోభం, అంతర్యుద్ధం కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+