"అదేదో ఇచ్చేసి మా వాడి నోర్మూయించండి.."- ఈసీకి అభిజీత్ దిప్కే సవాల్..!
ఎస్ఐఆర్ (SIR) వివాదాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్ఠ అంతకంతకూ మసకబారుతోంది. ఇన్నాళ్లూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎన్నికల ప్రక్రియను అత్యంత సాఫీగా నిర్వహిస్తుందనే పేరు తెచ్చుకున్న ఈసీ పరిస్ధితి ఇప్పుడు నిత్యం విమర్శలు ఎదుర్కునే వరకూ వచ్చేసింది. ఇదే క్రమంలో తాజాగా ఫామ్ 6లో మార్పులు చేస్తూ, దానికి సుప్రీంకోర్టు అనుమతి కూడా ఉందంటూ ప్రెస్ రిలీజ్ లు కూడా ఇచ్చిన ఎన్నికల సంఘం..నిన్న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ .. అదేమీ లేదంటూ తేల్చేయడంతో దొరికిపోయింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను మరింతగా ఆడుకుంటోంది.
ఫామ్ 6లో (Form 6) మార్పులు సుప్రీంకోర్టు (Supreme Court) ఆమోదంతోనే జరిగాయంటూ ఎన్నికల సంఘం సెప్టెంబర్ 26న విడుదల చేసిన ప్రెస్ మీట్లో ఉంది. అయితే నిన్న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ మాత్రం తాము ఫామ్ 6 మార్పులకు అనుమతి ఇవ్వలేదని, తమ పేరు చెప్పి మార్పులు చేసిన వారి వివరాలతో కూడిన రికార్డు సమర్పించాలని ఈసీకి నోటీసులు ఇచ్చింది. దీంతో ఈసీ ఆ వివాదాస్పద ప్రెస్ మీట్ ను వెబ్ సైట్ నుంచి తొలగించింది. దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా అవన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టిపారేసింది.

Dear @PIBFactCheck, please post the press release and shut this @AshutoshRanka’s mouth. Bohot bolta hai.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 5, 2026
అలా అయితే ఆ ప్రెస్ రిలీజ్ ను బయటపెట్టాలంటూ కాక్రోచ్ పార్టీ నేత అశుతోష్ రాంకా అడగటం మొదలుపెట్టారు. దీంతో ఈసీతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా ఇరుకున పడుతోంది. అశుతోష్ రాంకా ఎక్స్ లో ప్రెస్ రిలీజ్ తీసేశారంటూ పెట్టిన పోస్టును ఫేక్ గా అభివర్ణిస్తూ పీఐబీ ఇచ్చిన వివరణపై సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) వ్యంగ్యంగా స్పందించారు. తన సహచరుడు అశుతోష్ రాంకా ఎక్కువ మాట్లాడున్నాడని, అతను అడుగుతున్న ప్రెస్ రిలీజ్ ఇచ్చేసి అతని నోరు మూయించాలంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కు దిప్కే సూచించారు. తద్వారా ఈసీ ప్రెస్ రిలీజ్ ను వెబ్ సైట్ నుంచి తీసేయలేదని నిరూపించుకోవాలని దిప్కే కోరారు. దీనిపై పీఐబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.













Click it and Unblock the Notifications
