"సుప్రీం విశ్వసనీయత కోల్పోయింది"-సీజేఐ, మరో జడ్జిపై కాక్రోచ్ సంచలన ఆరోపణలు..!

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ వ్యవహారం నానాటికీ వివాదాస్పదమవుతోంది. ఈ ప్రక్రియలో తోటి ఎన్నికల కమిషనర్లను సైతం లెక్కచేయకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకున్నారంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టిన తర్వాత.. విపక్షాలు ఆయన రాజీనామా చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో ఇదే డిమాండ్ తో ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో ముంబైలో ఉద్యమాలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తాజాగా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) పాత్రపైనా విమర్శలు గుప్పించింది.

జమిలి ఎన్నికలకు కేంద్రం ? సుప్రీం జడ్డీలతో భేటీకి జేపీసీ ప్లాన్..! చివరికి..!
జమిలి ఎన్నికలకు కేంద్రం ? సుప్రీం జడ్డీలతో భేటీకి జేపీసీ ప్లాన్..! చివరికి..!

బెంగాల్, బీహార్‌లలో చట్టవిరుద్ధమైన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చూసిన భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలు ఈ విషయంలో మౌనంగా తప్పుకోవాలంటూ సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ సంచలన డిమాండ్ చేశారు. ఒకవేళ వారు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా, దాన్ని కొనసాగించవచ్చన్నారు. కానీ ఎవరూ పట్టించుకోరన్నారు. జెన్ జెడ్ (Gen Z) తరం వారి ఓటు హక్కులు, రాష్ట్ర ఎన్నికలు కూడా దొంగిలించబడటంలో సుప్రీంకోర్టు కూడా పాలుపంచుకుందంటూ సౌరవ్ దాస్ షాకింగ్ ఆరోపణలు చేశారు.

CJP Alleges SC Bench Has Zero Credibility Over SIR Proceedings Targets CJI Surya Kant Justice Bagchi

జ్ఞానేష్ భవితవ్యం తేల్చేయబోతున్న సుప్రీంకోర్టు..! SIRలో ఏకపక్ష నిర్ణయాలపై..!
జ్ఞానేష్ భవితవ్యం తేల్చేయబోతున్న సుప్రీంకోర్టు..! SIRలో ఏకపక్ష నిర్ణయాలపై..!

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీలను చీల్చడం, ఢిల్లీ రాజ్యాంగ సంక్షోభం కేసు వంటి ముఖ్యమైన పిటిషన్లను సకాలంలో విచారించకుండా, తీర్పు ఇవ్వకుండా చేయడం ద్వారా బీజేపీయే చివరికి లాభపడిందన్నారు. ఇది మన న్యాయవ్యవస్థపై ఒక పెద్ద మచ్చ అన్నారు. అందువల్ల, ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం తమకు నచ్చింది చేసుకోవచ్చని, కానీ ప్రజల దృష్టిలో దానికి అస్సలు విశ్వసనీయత ఉండదని తేల్చి చెప్పేశారు. జవాబుదారీతనాన్ని భారత ప్రజలే, యువతరమే నిర్ణయిస్తారని, కోర్టు రేపు లేదా ఎప్పుడైనా తనకు నచ్చింది చేసుకోవచ్చంటూ సౌరవ్ దాస్ సూచించారు. ఇప్పటికే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు, నిర్ణయాలపై ఆగ్రహంగా ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు ఏకంగా ఎస్ఐఆర్ తో పాటు బీజేపీకి లబ్ది కలిగించేలా పలు నిర్ణయాలు తీసుకుందంటూ చేసిన ఆరోపణలపై సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+