నాలుగేళ్ల తర్వాత ఆర్‌బీఐ గట్టి దెబ్బ.. వడ్డీలపెంపు ఖాయమే!

గత కొన్నాళ్లుగా ఊరటనిచ్చిన వడ్డీ రేట్ల కాలం ముగిసిపోతోంది. దేశంలో నిత్యావసరాల ధరల మంట, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలకు తోడు రూపాయి విలువ చారిత్రాత్మక పతనంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయానికి సిద్ధమైంది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో వడ్డీ రేట్లను పెంచేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆర్థిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలోని ఆరుగురి సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక వడ్డీ రేటైన 'రేపో రేటు'ను 0.25 శాతం పెంచి 5.50 శాతానికి చేర్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 10 గంటలకు ముంబైలో గవర్నర్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.

అంతర్జాతీయ సంక్షోభం.. పెట్రో మంటలు!

ఈ కఠిన నిర్ణయానికి అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అలజడులే ప్రధాన కారణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేశాయి. దీనికితోడు ఈ ఏడాది నమోదైన బలహీన వర్షపాతం వల్ల రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాల ధరలు మరింత ప్రియమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 5 శాతానికి దగ్గరవడంతో, ధరలను అదుపులోకి తేవడానికి వడ్డీ రేట్ల పెంపు ఒక్కటే ఆర్‌బీఐకి మార్గంగా కనిపిస్తోంది.

RBI Set to Hike Repo Rate After 4 Years Home Loan and Car Loan EMIs Likely to Increase Soon
లోన్లు తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వడ్డీ!
లోన్లు తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వడ్డీ!

ఈఎంఐలు ఎంత పెరుగుతాయి?

ఒకవేళ ఆర్‌బీఐ రేపో రేటును పెంచితే బ్యాంకులు వెంటనే తమ డిపాజిట్ , రుణ వడ్డీ రేట్లను సవరిస్తాయి. దీంతో హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్లు తీసుకున్న వారిపై నెలకు చెల్లించే ఈఎంఐ భారం గణనీయంగా పెరగనుంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆర్‌బీఐ విడతలవారీగా దాదాపు 75 బేసిస్ పాయింట్ల వరకు రేట్లను పెంచే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా రేట్లను పెంచడం, రూపాయి బలహీనపడటంతో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ షేర్ మార్కెట్ల నుంచి నిధులను గుంజుకుంటున్నారు. దీని ప్రభావంతో గత ఎనిమిది వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోవడం గమనార్హం.

పో<strong>స్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఇలా..! కేబినెట్ కీలక నిర్ణయం..! </strong>
పోస్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఇలా..! కేబినెట్ కీలక నిర్ణయం..!

వ్యవస్థలో మిగులు నగదును లాగేస్తున్న ఆర్‌బీఐ!

ఇప్పటికే మార్కెట్లో ఉన్న మిగులు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ ఓపెన్ మార్కెట్ బాండ్ల విక్రయం ద్వారా రూ. 1 లక్ష కోట్లకు పైగా నిధులను వెనక్కి లాగేసింది. రూపాయి విలువను కాపాడేందుకు జూన్ నుంచి చేపట్టిన విదేశీ డిపాజిట్ల సేకరణ వల్ల ఏకంగా 133 బిలియన్ డాలర్ల మేర నిధులు సిస్టమ్‌లోకి వచ్చిపడ్డాయి. అయితే ఇప్పుడు అదే ద్రవ్యోల్బణానికి దారితీయడంతో రిజర్వ్ బ్యాంక్ బాండ్ల అమ్మకాలతో పాటు మరిన్ని కఠిన నిబంధనలు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏది ఏమైనప్పటికీ, రేపటి ఆర్‌బీఐ నిర్ణయం దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని, రుణగ్రహీతలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+