జ్ఞానేష్.. నీ పని అయిపోయింది బ్రో: గేట్లు, బ్యారికేడ్లు ఎక్కిన రాహుల్, ప్రియాంక గాంధీ

ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఈవీఎంలల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ దేశ రాజధానిలో ఇండియా బ్లాక్ చేపట్టిన భారీ నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఆరంభమైన ఈ మార్చ్ ను అడ్డుకోవడానికి అడుగడుగునా ఢిల్లీ పోలీసులు ప్రయత్నించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

జ్ఞానేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయం
జ్ఞానేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయం

అయినప్పటికీ.. ఈ మార్చ్ కొనసాగింది. విజయ్ చౌక్ మీదుగా కేంద్ర ఎన్నికల కమిషన్ హెడ్ క్వార్టర్ ఉన్న ఆకాశవాణి భవన్ కు చేరుకుంది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, సుప్రియ సులే, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఆకాశవాణి భవన్ కు చేరుకున్న తర్వాత లోనికి ప్రవేశించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.

జ్ఞానేష్ భవితవ్యం తేల్చేయబోతున్న సుప్రీంకోర్టు..! SIRలో ఏకపక్ష నిర్ణయాలపై..!
జ్ఞానేష్ భవితవ్యం తేల్చేయబోతున్న సుప్రీంకోర్టు..! SIRలో ఏకపక్ష నిర్ణయాలపై..!
Rahul Gandhi and MP Priyanka Gandhi Vadra reach Akashvani Bhavan in an attempt to reach the EC office

ఇండియా బ్లాక్ నేపథ్యంలో ఆకాశవాణి భవన్ పరిసరాల్లో గట్టి భద్రతను కల్పించారు పోలీసులు. బ్యారికేడ్లను అమర్చారు. అయినప్పటికీ.. వందల సంఖ్యలో దూసుకొచ్చిన నాయకులను అడ్డుకోవడం అసాధ్యమైంది. వారందరూ కూడా ఆకాశవాణి ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కొందరు నాయకులు, కార్యకర్తలు.. గేట్లు, బ్యారికేడ్లను ఎక్కడానికి ప్రయత్నించారు.

ఓ దశలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా బ్యారికేడ్లపైకి ఎక్కి నిల్చున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సైతం బ్యారికేడ్లపైకి ఎక్కారు. వారితో పాటు ప్రియాంక గాంధీ, సుప్రియా సులే, ఇతర నాయకులు బ్యారికేడ్లపై కూర్చున్నారు. ఆకాశవాణి భవన్, నీతి ఆయోగ్ కార్యాలయ పరిసరాలన్నీ కూడా జనసంద్రం అయ్యాయి. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ వారంతా ఇచ్చిన నినాదాలతో మార్మోగిపోయాయి.

అంతకుముందు.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు రాహుల్ గాంధీ. "జ్ఞానేష్.. అయిపోయింది బ్రో. రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది" అని పేర్కొన్నారు. మార్చ్ సాగిన మార్గం అంతా కూడా భద్రతా సిబ్బందిని మోహరింపజేశారు. పలు చోట్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+