జాన్వీ పెళ్లి ఫిక్స్ అయిందా?.. ఆ టీ-షర్ట్‌లో అసలు సీక్రెట్ ఇదేనా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కపూర్ ఖాందాన్ వారసురాలు జాన్వీ కపూర్ తన నటనతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రేమ వ్యవహారంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు, రాజకీయ నేపథ్యం ఉన్న శిఖర్ పహాడియాతో జాన్వీకపూర్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

JAILER 2 Official Trailer: రజనీకాంత్ 'జైలర్ 2' ట్రైలర్ రిలీజ్..
JAILER 2 Official Trailer: రజనీకాంత్ 'జైలర్ 2' ట్రైలర్ రిలీజ్..

వైరల్ అవుతున్న స్పెషల్ టీ-షర్ట్ లుక్
ఇప్పటివరకు తమ బంధంపై అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. వివిధ సందర్భాల్లో జాన్వీ కపూర్ ఇచ్చే హింట్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో విమానాశ్రయంలో దిగిన జాన్వీ కపూర్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె వేసుకున్న టీ-షర్ట్‌పై "ఒకవేళ నేను తప్పిపోతే.. నన్ను శిఖర్ పహాడియా వద్దకు చేర్చండి" అని రాసి ఉండటం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. అంతకు ముందు కూడా ఓ సినిమా స్క్రీనింద్ సందర్భంగా "Shikhu" అని రాసి ఉన్న స్పెషల్ చైన్ ధరించి ఆమె కనిపించారు.

Janhvi Kapoor Wedding Rumours Actress Wears Shikhar Pahariya T-Shirt Fans Hint at Marriage

కపూర్ కుటుంబం ఆమోదం
జాన్వీ తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్‌లతో శిఖర్ పహాడియాకు చాలా మంచి అనుబంధం ఉంది. కపూర్ కుటుంబంలో జరిగే వేడుకలకు, పండుగలకు శిఖర్ పహాడియా హాజరవుతుంటారు. దీన్ని బట్టి వీరి పెళ్లికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభించిందని స్పష్టమవుతోంది.

పండగ రేసు నుంచి తప్పుకున్న వెంకటేశ్ సినిమా.. ఫ్యాన్స్ కు పెద్ద షాక్..
పండగ రేసు నుంచి తప్పుకున్న వెంకటేశ్ సినిమా.. ఫ్యాన్స్ కు పెద్ద షాక్..

అభిమానుల కామెంట్ల వర్షం
మహారాష్ట్ర రాజకీయాల్లో ఎంతో గుర్తింపు పొందిన కుటుంబానికి చెందిన శిఖర్ పహాడియాతో జాన్వీ కపూర్ జంటను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ క్యూట్ కాంబినేషన్‌కు సోషల్ మీడియా భారీగా ఆదరణ లభిస్తుండటంతో.. " ఇక ఆలస్యం చేయకుండా త్వరలోనే గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోండి" అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+