Viral Video: యువతిని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన యువకుడు.. ఎక్కడంటే..?

ఇటీవల గురుగ్రామ్ లో ఓ మహిళా బైకర్ ను ఓ వ్యక్తి తన కారుతో ఢీ కొట్టిన ఘటన మరువక ముందే మరో షాకింగ్ ఘటన జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ యువతిని కారుతో ఢీ కొట్టి అలా కొంతదూరం ఈడ్చుకెళ్లాడు ఓ యువకుడు. లక్నో గోమతీనగర్‌ లోని జనేశ్వర్‌ మిశ్రా పార్క్‌ సమీపంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రేమ వ్యవహారంలో భాగంగానే యువతీయువకులు ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కారు ముందు నిల్చుని ఉన్న యువతిపై కారులోని యువకుడు అత్యంత దారుణంగా కారుతో ఢీ కొట్టాడు. అంతేకాక ఆమెను కొంతదూరం ఈడ్చుకెళ్లి అలాగే ముందుకు వెళ్లిపోయాడు. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలయ్యాయి.

Lucknow Atrocity in the middle of the road in Young woman dragged by car and thrown to the ground

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు షహన్వాజ్‌ గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అలాగే కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో బాధితురాలు, నిందితుడి మధ్య ఏడాది కాలంగా పరిచయం ఉన్నట్లు తేలింది. అయితే పార్క్‌ వద్ద మరో యువతితో అతడిని చూసిన బాధితురాలు.. షహన్వాజ్ తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనంతరం ఆమె కారు ముందు నిలబడి వాగ్వాదం చేస్తున్న క్రమంలో షహన్వాజ్ తన కారుతో ముందుకు దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అయితే షహన్వాజ్.. ఆ బాధితురాలిని ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీ కొట్టాడా..? లేక ఈ ఘటన అనుకోకుండా జరిగిందా..? అనే విషయంపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక షహన్వాజ్ తనకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దాంతో అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఇటీవలి కాలంలో జనేశ్వర్‌ మిశ్రా పార్క్‌ సమీపంలో ఘర్షణలతో పాటు ఇలాంటి ఘటనలు అధికం అవుతున్న క్రమంలో తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+