హార్దిక్ విషయంలో జాగ్రత్త పడండి: పాండ్యా కోసం అతన్ని వదులుకోవద్దు
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ట్రైడింగ్ వ్యవహారంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌ను చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తలపై తన యూట్యూబ్ ఛానెల్‌లో విశ్లేషించాడు. ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ముంబై ఇండియన్స్ కు సూచించాడు. ప్లేయర్ల స్వాపింగ్ విధానాన్నీ తప్పుపట్టాడు.
గత ఐపీఎల్ సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించని హార్దిక్ పాండ్యాను బదిలీ చేసేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధంగా ఉందనే ఊహాగానాలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. రాబోయే ఐపీఎల్ నాటికి హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ కు గానీ, కోల్ కత నైట్ రైడర్స్ కు గానీ వెళ్తాడంటూ వెల్లువెత్తుతున్న వార్తల్లో వాస్తవం లేకపోలేదని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. అతని కోసం శివమ్ దూబేతో పాటు ఓ ఫాస్ట్ బౌలర్‌ను కూడా ఇచ్చేందుకు సీఎస్‌కే సిద్ధంగా ఉండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు.

కేకేఆర్ నుంచి కామెరాన్ గ్రీన్ ట్రేడింగ్ అంశాన్ని కూడా ప్రస్తావించాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం అనుసరిస్తోన్న ఈ విధానం.. తమ ప్రత్యర్థి జట్లను బలోపేతం చేసేలా ఉంటోందని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ కేకేఆర్‌కు హార్దిక్‌ను ఇవ్వాల్సి వస్తే.. దానికి ప్రతిఫలాన్ని తసీుకోవాల్సి ఉంటుందని సూచించాడు. తానే గనక ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌లో ఉంటే, ఒకే ఒక్క నిబంధనపైనే కేకేఆర్‌తో డీల్‌కు ఒప్పుకొనే వాడినని, హార్దిక్‌కు బదులుగా హర్షిత్ రాణా, రింకూ సింగ్‌లను ముంబై జట్టులోకి తీసుకునే వాడినని అన్నారు.
హార్దిక్ లాంటి స్టార్ ఆటగాడిని వదులుకున్నప్పుడు దానికి తగ్గ విలువైన ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకోవాల్సి ఉంటుందని ముంబై ఇండియన్స్ కు సూచించాడు అశ్విన్. ప్రత్యర్థి జట్లు మరింత బలోపేతం కాకుండా ముంబై జాగ్రత్త పడాలని చెప్పాడు. హార్దిక్ చేరికతో కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ అత్యంత ప్రమాదకరంగా మారుతుందని, అది ముంబైకే నష్టమని విశ్లేషించాడు. సీఎస్‌కే జైత్రయాత్రను అడ్డుకోవడానికి కూడా ముంబై ఈ ట్రేడింగ్‌పై పునరాలోచన చేయాలని చెప్పాడు.
హార్దిక్ పాండ్యా ఇటీవల ఐపీఎల్ సీజన్లలో ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమౌతోన్నాడు. అతని సారథ్యంలో ముంబై ఇండియన్స్ నిలకడ లేని ఆటతీరుతో నిరాశకు గురి చేస్తోంది. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా.. జట్టు విజయాలను ఒంటిచేత్తో శాసించగల ఆటగాడని, అతన్ని వదులుకోవాలన్న ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ కు పెద్దగా కలిసి రాకపోవచ్చని తేల్చి చెప్పాడు.
హార్దిక్ కోసం శివందూబే వంటి ఆల్ రౌండర్ ను వదులుకోవాలనుకోవడం చెన్నై సూపర్ కింగ్స్ కు ఏ మాత్రం మంచిది కాదని సూచించాడు. శివం దూబే ఏ జట్టులోకి వెళ్లినా ఓ మాన్ స్టర్ లా మారతాడని, తమ బలాన్ని ప్రత్యర్థులకు ఇచ్చినట్టవుతుందని వ్యాఖ్యానించాడు. ఫ్రాంచైజీని వీడాలని కోరే హక్కు ఆటగాడికి ఉన్నప్పటికీ, ఏ జట్టుకు వెళ్లాలో నిర్ణయించే అధికారం మాత్రం యాజమాన్యాల చేతిలోనే ఉంటుందని అశ్విన్ గుర్తుచేశాడు.




Click it and Unblock the Notifications