'నేను తల్లిని కాబోతున్నా': అదా శర్మ షాకింగ్ పోస్ట్
'ది కేరళ స్టోరీ' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదా శర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ తనదైన శైలిలో ఫన్నీ పోస్టులతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో క్యాప్షన్ నెట్టింట సంచలనంగా మారింది. ఆ వీడియోకు ఆమె "నేను తల్లిని కాబోతున్నాను! మా పాపాయికి ఏం పేరు పెట్టాలి?" అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే పూర్తి వీడియో చూసిన తర్వాత అసలు విషయం తెలిసి వారంతా నవ్వుకుంటున్నారు.
నిజానికి అదా శర్మ పెట్టిన ఈ పోస్ట్ నవ్వు తెప్పించే ఓ ప్రాంక్ వీడియో. ఆ వీడియో ప్రారంభంలో అదా శర్మ కెమెరా ముందుకు వచ్చి ఎంతో గంభీరంగా "నేను తల్లిని కాబోతున్నాను" అని చెబుతుంది. ఆ వెంటనే తన పెద్ద కళ్లను తిప్పుతూ.. "సొంత తల్లిని కాదు.. సెంటిమెంట్ స్టెప్‌మదర్!" అంటూ అసలు ట్విస్ట్ ఇచ్చింది. అదా శర్మ నిజ జీవితంలో కాదు.. తన ఇంటి దగ్గర నివసించే ఓ కాకుల జంటకు పుట్టిన పిల్ల పక్షికి తాను పెంపుడు తల్లిని అయ్యానంటూ ఈ ఫన్నీ వీడియో ద్వారా పరిచయం చేసింది.

ఈ వీడియోలో అదా శర్మ తన ఇంటి టెర్రస్ మీద నిలబడి.. అక్కడ నివసించే ఓ కాకుల జంటను అభిమానులకు చూపిస్తుంది. ఆ పక్షులకు ఆమె ప్రత్యేకంగా పేర్లు కూడా పెట్టడం విశేషం. పైపుపై కూర్చున్న కాకి పేరు 'రస్సెల్' అని, కరెంట్ తీగలపై కూర్చున్న దాని భాగస్వామి పేరు 'గోదావరి కులకర్ణి' అని అదా పరిచయం చేసింది. మరాఠీ యాసలో మాట్లాడుతూ.. గోదావరి కళ్లు చాలా అందంగా ఉన్నాయని, అది తన గూటిలో ఎంతో ముద్దుగా కూర్చుని ఉందని అదా శర్మ అభివర్ణించింది.
Main maa banne waali hu!❤️what should we name the baby ? pic.twitter.com/WEKc3PsgZV
— Adah Sharma (@adah_sharma) June 3, 2026
రస్సెల్, గోదావరి కులకర్ణిల గూటిలోకి ఓ చిన్న కాకి పిల్ల కొత్తగా వచ్చిందని.. అది ఎంతో ముద్దుగా ఉందని అదా శర్మ వీడియోలో చూపించింది. ఆ నూతన అతిథి రాక వల్లే తాను దానికి "పెంపుడు తల్లి" అయ్యానని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చింది. వీడియో ముగింపులో కాకులు, కోయిల కూతలతో తను కూడా గొంతు కలిపి ఒక డిఫరెంట్ మ్యూజిక్ సెగ్మెంట్‌ను క్రియేట్ చేసింది. తాను ఒక వారం రోజుల పాటు పని మీద బయటకు వెళ్తున్నానని.. అందుకే ఆ బుజ్జి కాకి పిల్ల తదుపరి అప్‌డేట్స్‌ను వచ్చే వారం షేర్ చేస్తానని అదా శర్మ పేర్కొంది.












Click it and Unblock the Notifications