'పెద్ది' ఫస్ట్ డే కలెక్షన్స్ ..? మైండ్ బ్లోయింగ్ బిజినెస్..!

తెలుగు రాష్ట్రాల్లో పెద్ది హవా స్టార్ట్ అయింది. ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి. అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక రేపటినుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో బాక్సాఫీస్ ఊచకోతకు రెడీ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న థియేటర్లో విడుదల కానున్న పెద్ది సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సమ్మర్ లో ఒక్క పెద్ద సినిమా కూడా లేక థియేటర్లు వెలవెల బోయాయి. ఇప్పుడు పెద్ది సినిమాతో థియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు.

ఇక ఇప్పటికే పలు రివ్యూల ఆధారంగా చూస్తే పెద్ది సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపానికి తోడు బుచ్చిబాబు అద్భుతమైన టేకింగ్ సినిమాకు మేజర్ ప్లస్ అని తెలుస్తోంది. ఇక రిలీజ్ కు ముందే పెద్ది అనేక రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే పెద్ది ప్రీ సేల్స్ తోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.35 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైనే టికెట్ అమ్మకాలు జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక మిగతా దేశాల్లోనూ పెద్ది బుకింగ్స్ జోరు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటు తెలుగు రాష్ట్రాలు, పాన్ ఇండియా స్థాయిలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున జరిగాయి. దాంతో పెద్ది సినిమాకు ఫస్ట్ డే ఎంత కలెక్షన్ వస్తుందనేని ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం.. 'పెద్ది' చిత్రం మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు 150 నుంచి రూ. 180 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇక టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం అంతకుమించిన వసూల్లు సాధిస్తుందని సమాచారం. మొత్తానికి అటు ప్రీమియర్స్ ఇటు రేపటి రెగ్యూలర్ షోస్ కలుపుకుని ఫస్ట్ డే పెద్ది మూవీ ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Peddi Day 1 Box Office Collections Record-Breaking Opening amp amp Mind-Blowing Business Details Peddi

పెద్ది మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్​ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. పెద్ది సినిమా కూడా అదే రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగ రాస్తుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+