పెద్ది పబ్లిక్ టాక్: సినిమాలోని ప్లస్ లు, మైనస్ లు ఇవే..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన 'పెద్ది' మూవీ ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద చాలా రోజుల తర్వాత పండగ వాతావరణం నెలకొంది. వేసవిలో ఒక్క పెద్ద సినిమా కూడా లేక వెలవెలబోయిన థియేటర్లలో పెద్ది సినిమా పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఇక ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకులు పెద్ది సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ బాడీ బిల్డింగ్, పర్ఫార్మెన్స్ అదిరిపోయాయని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. స్టోరీలో ఎమోషనల్ డెప్త్ ఉందని, హీరోయిన్ జాన్వీ కపూర్ అందాలు కనువిందు చేస్తాయని అంటున్నారు. సాంగ్స్ బాగున్నాయని, జగపతి బాబు అప్పలసూరి క్యారెక్టర్ మరో లెవల్ అని కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ది సినిమా చూసిన పబ్లిక్ చెబుతున్న మాటల ప్రకారం.. రామ్ చరణ్ ఇంట్రడక్షన్, క్రికెట్ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే రెండు ఎపిసోడ్లు చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ సీన్స్ , రామ్ చరణ్, దివ్యేందు శర్మ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి అని టాక్ వినిపిస్తోంది. ఇక ఫస్టాఫ్ లో వచ్చే రయ్ రయ్ రా రా, చికిరి చికిరి పాటలు మంచి ఎనర్జీని తీసుకొచ్చాయి. ఏ. ఆర్. రెహమాన్ సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ మరోసారి తన స్థాయిని పెంచాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి హైతో ముగుస్తూ, సెకండ్ హాఫ్‌పై మరింత ఆసక్తిని పెంచింది.. అని మాట్లాడుకుంటున్నారు.

Peddi Premieres Live Ram Charan amp amp Buchi Babu Film s Key Strengths amp amp Weaknesses From Public Talk

ఇక సెకండ్ హాఫ్ ఆరంభం లో ఒక అరగంట వరకు సినిమా స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా ఉంటుందని.. ఆ తర్వాత చివరి 45 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే..? ఈ సినిమాలో రామ్ చరణ్ కు కాళ్లు కూడా పోతాయట. అయినప్పటికీ ఒలింపిక్స్ లో గేమ్స్ ఆడి గెలిచి.. తన ఊరికి ఎనలేని ప్రతిష్టని తీసుకొచ్చే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+