'పెద్ది' ట్విట్టర్ రివ్యూ: పోతారు..మొత్తం పోతారు..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' ప్రీమియర్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యాయి. సంక్రాంతి సినిమాల తర్వాత వేసవిలో ఒక్క పెద్ద సినిమా కూడా లేక థియేటర్లు వెలవెల బోయాయి. అయితే పెద్ది సినిమాతో మళ్లీ థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే పెద్ది సినిమాకు సంబంధించి రివ్యూలు బయటకు వచ్చాయి. సినిమా చూసినవాళ్లు బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
#Peddi Average 1st Half!
— Venky Reviews (@venkyreviews) June 3, 2026
Pre-interval to interval sequence is solid and the highlight so far. Charan’s intro sequences also are neat. Apart from this it remains pretty flat and choppy. Heroine and villain track don’t work. Charan’s performance and music is carrying this one so…
ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకూ సీట్లో ఎవరూ కూర్చోని విధంగా దర్శకుడు బుచ్చిబాబు సినిమాను తెరకెక్కించాడని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ లో రయ్ రయ్ రారా సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందేనని అంటున్నారు. అలాగే చికిరి చికిరి సాంగ్ ను కూడా అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్ జాన్వీ కపూర్ అందాలు మాస్ ఆడియన్స్ కూ పండగేనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక అప్పలసూరిగా జగపతిబాబు జీవించారని తెలుస్తోంది. నైట్ క్రికెట్ సీన్స్ సినిమాకే హైలెట్ అని సమాచారం. మొత్తానికి ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్ గా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి.

#PEDDI First Half Review
— Telugu360 (@Telugu360) June 3, 2026
Interval block stands out with Ram charan fierce performance and body building
The first half of PEDDI is decent, with a story that carries emotional depth. Buchi Babu effectively establishes the struggles of a homeless laborer while also presenting…
ఇక సెకండాఫ్ లో స్టోరీ దిల్లీకి షిఫ్ట్ అవుతుంది. సెకండాఫ్ లో స్టార్టింగ్ లో కొంత స్లోగా ఉన్నప్పటికీ చివరి 40 నిమిషాలు పెద్ది క్యారెక్టర్ లో రామ్ చరణ్ జీవించినట్లు తెలుస్తోంది. చివరి 40 నిమిషాలు సినిమాకే హైలెట్ అని టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఏడిపించేశాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పెద్ది మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించారు. మొత్తానికి రేపటినుంచి థియేటర్ల వద్ద పెద్దిగాడి మాస్ సంభవం అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications