తొలి కేబినెట్ మీటింగ్ లో సీఎం డీకే శివకుమార్ సంచలన నిర్ణయాలు..

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పారిశ్రామిక, యువ, విద్యార్థి సంక్షేమంపై దృష్టి సారించారు. జూన్ 3 బుధవారం బెంగళూరులో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. ఆయన రాష్ట్ర శాసనసభకు చేరుకుని మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 13 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే, శివకుమార్ యువత, విద్యార్థులు, ఉపాధి, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సమస్యలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం లభించింది.

ముఖ్యంగా రాష్ట్రంలోని నాన్-లగ్జరీ ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్‌లను ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులకు పెద్ద ఉపశమనం అందించనుంది. సమావేశం అనంతరం సీఎం డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. "ఎస్ఎస్‌ఎల్‌సి, పీయూసీ, డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చదువుతున్న వారితో సంబంధం లేకుండా, విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులు అందిస్తున్నాం" అని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే 56,000 ఉద్యోగాలను ప్రభుత్వం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. "తదుపరి కేబినెట్ సమావేశం నాటికి, అన్ని విభాగాలను పిలిచి, నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారు. నియామక ప్రక్రియ ఎలా ప్రారంభమవుతుందో సూచించే క్యాలెండర్‌ ను విడుదల చేస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలను మెరుగుపరచడానికి, ఒక ప్రైవేట్ ఉపాధి కల్పన కేంద్రాన్ని (ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీ) ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కేంద్రంలో ఉద్యోగార్థులు తమ పేర్లను నమోదు చేసుకుని, సంభావ్య యజమానులతో కనెక్ట్ అవ్వొచ్చు. "ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి కోసం విధానాలు నెల రోజుల్లో ఖరారు చేస్తాం" అని శివకుమార్ వెల్లడించారు.

ఈ ప్రైవేట్ ఉపాధి కల్పన కేంద్రం ఫ్రేమ్‌ వర్క్‌ను ఖరారు చేయడానికి ముగ్గురు మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. "పరిశ్రమలు, ఆసుపత్రులు, హోటళ్లు మరియు ఇతర రంగాలు తమ అవసరాలను నమోదు చేసుకోగల ఆన్‌ లైన్ వేదికను మేము సృష్టిస్తాము, యువత ఉద్యోగాలు, శిక్షణ కోసం నమోదు చేసుకోవచ్చు" అని ముఖ్యమంత్రి వివరించారు. యువతలో నాయకత్వ నైపుణ్యాలు, సామాజిక సామరస్యం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కర్ణాటక వ్యాప్తంగా 10,000 భారత్ జోడో యువ సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ వార్డులో ఒక భారత్ జోడో యువ సంఘాన్ని ఏర్పరుస్తారు. ప్రతి సంఘంలో 150 నుండి 200 మంది సభ్యులు ఉంటారు. క్రీడలు, సంస్కృతి, విద్య, నాయకత్వ అభివృద్ధిపై ఈ సంఘాల కార్యకలాపాలు దృష్టి సారిస్తాయి. "ప్రతి గ్రామ పంచాయతీలో భారత్ జోడో యువ సంఘానికి రూ. 10 లక్షలు కేటాయిస్తారు" అని శివకుమార్ ప్రకటించారు.

'భూ-గ్యారెంటీ' పథకం కింద బి-ఖాటా ఆస్తులను ఎ-ఖాటా ఆస్తులుగా మార్చే కార్యక్రమాన్ని విస్తరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది ఆస్తి యజమానులకు ప్రయోజనం చేకూర్చనుంది. కొన్ని అనధికార భవనాల యజమానులు నిర్దిష్ట షరతులకు లోబడి పౌర సేవలను పొందేందుకు వీలు కల్పిస్తామని శివకుమార్ తెలిపారు.

ఈ సమావేశంలో బెంగళూరు నగరంలో రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 2,000 కోట్ల ప్యాకేజీని కూడా ఆమోదించారు. ఈ నిధులను గ్రేటర్ బెంగళూరు అథారిటీ, బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తారు. గ్రామాలనుండి పట్టణాలకు రైతుల వలసలను నిరోధించడానికి తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

DKShivakumar Karnataka CM Takes new Sensational Decisions During His Very First Cabinet Meeting

మీడియాతో సమావేశంలో, శివకుమార్ వార్తా సంస్థల సహకారాన్ని కోరారు. విమర్శలను ఆహ్వానిస్తానని, కానీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అభ్యర్థించారు. "ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు సమన్వయంతో పనిచేయాలి" అని ఆయన అన్నారు. ప్రభుత్వం పరిశీలనకు సిద్ధంగా ఉన్నప్పటికీ, మీడియా "కథలు అల్లడం" మానేయాలని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+