మెటాకు కేంద్రం భారీ షాక్- జుకర్ బర్గ్ కు 3 రోజుల అల్టిమేటం..!

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో కేంద్రం షేర్ చేసిన ప్రధాని మోడీ (PM Modi) వీడియోను తొలగించిన వ్యవహారంలో మెటా (Meta)కు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ నిన్న సమన్లు కూడా జారీ చేసిది. ఇవాళ దీనికి కొనసాగింపుగా పార్లమెంట్ కమిటీ ఈ వ్యవహారంపై క్షమాపణ చెప్పాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు (Mark Zuckerberg) మూడు రోజుల అల్టిమేటం ఇచ్చింది.

పీకే విజయం వెనుక కీలక కారణాలు- కాక్రోచ్ పోరు టూ కులాల లెక్కల గల్లంతు వరకూ.!
పీకే విజయం వెనుక కీలక కారణాలు- కాక్రోచ్ పోరు టూ కులాల లెక్కల గల్లంతు వరకూ.!

మూడు రోజుల్లోగా తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, ఫేస్‌బుక్‌కు ఉన్న సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేసే విషయాన్ని కేంద్రం పరిశీలించవచ్చని, తద్వారా ఆ ప్లాట్‌ఫామ్ అధికారులపై నేరుగా క్రిమినల్ విచారణ జరిపే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలోని పార్లమెంట్ కమిటీ.. ప్రధాని మోదీ వీడియోను తొలగించడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది. ఇది 140 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిని లక్ష్యంగా చేసుకున్నట్లుందని పేర్కొంది. ఇందుకు ప్రతిగా ఫేస్‌బుక్ సేఫ్ హార్బర్ రక్షణను కేంద్రం రద్దు చేస్తే .. దాని అధికారులపై నేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది.

Mark Zuckerberg Gets 3-Day Deadline From House Panel to Apologise in PM Video Dispute
కాక్రోచ్ లు తెచ్చిన మార్పు..! మోడీ రీల్స్ నుంచి లోక్ సభలో జెన్ జీ భాష వరకూ..!
కాక్రోచ్ లు తెచ్చిన మార్పు..! మోడీ రీల్స్ నుంచి లోక్ సభలో జెన్ జీ భాష వరకూ..!

జూలై 23న ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియోను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.
ఆ సెల్ఫీ వీడియోలో ప్రధాని మోదీ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మెటా ఆ పోస్ట్ యొక్క ఫేస్‌బుక్ వెర్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేసి.. ఆ తర్వాత పునరుద్ధరించింది. ఈ ఘటనపై ఇప్పటికే పార్లమెంట్ కమిటీ మెటా అధికారులను పిలిపించి ప్రశ్నించింది. దీంతో సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని మెటా క్షమాపణ చెప్పింది. అయినా ఇది సమంజసం కాదని కమిటీ తిరస్కరించింది. ఒకవేళ ఇది నిజంగా సాంకేతిక లోపం వల్లే జరిగుంటే మెటా ఒక టెక్నాలజీ కంపెనీగా ఇలాంటి పొరపాట్లను నివారించడానికి తన వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+